మన తెలుగులో హీరోలు ఇప్పుడు కథల్లో పూర్తి స్థాయిలో భిన్నం అనేది కోరుకునే ప్రయత్నం చేస్తున్నారు. కథ ఎంత కొత్తగా ఉంటే సినిమా అంత కమర్షియల్ గా విజయం సాధిస్తుంది అనే భావాన్ లో హీరోలు ఉన్నారు. దర్శకులు నిర్మాతలు కూడా అదే భావన లో ఉండి సినిమాలను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మన తెలుగులో ఉన్న అగ్ర హీరోలు అందరూ కూడా తమ స్థాయికి దిగి సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు అనే విషయం అర్ధమవుతుంది. చిన్న చిన్న హీరోలు కూడా ఇప్పుడు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఒక డిమాండ్ ని తన తర్వాతి సినిమా దర్శకుడికి చెప్పినట్టు సమాచారం. అది ఏంటీ అంటే... తన పాత్రకు కచ్చితంగా ఏదోక వైకల్య౦ ఉండాలని అందులో ప్రధానంగా ఒక కన్ను కనపడకుండా నటించే విధంగా పాత్రను ఇవ్వాలి అని సూచిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా చేస్తున్నా సరే రామ్ చరణ్ తర్వాతి సినిమా కోసం ఈ నిర్ణయం తీసుకోవడం నిజం గా సంచలనం అని అంటున్నారు టాలీవుడ్ జనం. 

 

తన సినిమాకు తన గ్లామర్ అవసరం లేదని తనను ప్రేక్షకులు మంచి నటుడిగా గుర్తింపు ఇచ్చే విధంగా సినిమా ఉండాలి అని సూచించాడట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనేది చూడాలి. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రామ్ చరణ్ చాలా వరకు కష్టపడుతూ వేరే సినిమా కథను కూడా వినడం లేదని సమాచారం. కాని దర్శకుడిని మాత్రం కథ రెడీ చెయ్యాలని తన పాత్ర ఇలా ఉండాలి అని చెప్పినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: