ఒక వైపు కరోనా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆంధ్ర వాసులు మరో కోలుకోలేని దెబ్బ ఎదురైంది.. అదేంటంటే విశాఖ లోని గ్యాస్ లీక్.. పొద్దున్నే లేవగానే చావు కబురను మోస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం విశాఖను కదిలించి వేస్తుంది.. ప్రాణాంతకమైన కార్బన్ మోనో ఆక్సైడ్ విడుదల కావడంతో ప్రజలు ఊపిరి ఆడక చాలా మంది ప్రాణాలను విడిచారు.. 

 

 

 

 

 

విశాఖ లోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి ప్రమాదకరమైన గ్యాస్ లీకై ఎనిమిదిమంది మరణించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజానీకాన్ని ఈ గ్యాస్ లీక్ ఘటన అతలాకుతలం చేసింది. ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతంలో కనిపిస్తున్న మనుషుల కళేబరాలు మనసును కదిలించి వేస్తుంది.. ఆ ఘటన చూసిన ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు.. 

 

 

 

 

తాజాగా ఈ విషయం పై స్పందించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారం వ్యక్తం చేశారు.. మొదట కరోనా.. ఇప్పుడు గ్యాస్.. మనుషులపై దాడి చేశాయి. ఇక మనుషులపై దాడి చేయడానికి ఏలియన్స్‌ మాత్రమే మిగిలి ఉన్నాయని అనిపిస్తోంది' అని బాధను వ్యక్తం చేస్తున్నట్లు ఎమోజీలు పోస్ట్ చేశారు.

 

 

 

 

సినీ పరిశ్రమ మూసేసినప్పటి నుంచి, రియల్ లైఫ్ థ్రిల్లర్ సినిమాలు చూపిస్తూ దేవుడు చాలా బిజీగా ఉన్నాడు. ఎటువంటి మత, కుల, జాతి వివక్ష లేకుండా మనుషుల్ని చంపేది ఈ మూడే.. ఉగ్రవాదులు, వైరస్, దేవుడు' అని వర్మ ట్వీట్లు చేశారు. కాగా, విశాఖపట్నం ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.. ఎంతైనా కరోనా కమ్ముకొని ప్రజలను అతలా కుతలం చేసింది.. అప్పుడే ఇలా గ్యాస్ లీక్ అవ్వడంతో చాలా మంది మృత్యువాత పడటం భాదకరమని అంటున్నారు.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: