కరోనా వైరస్ దెబ్బకి సినిమా ఇండస్ట్రీలో చాలా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వేసవికాలంలో సీజన్ కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకుని నిర్మించిన సినిమాల నిర్మాతలు రిలీజ్ అవ్వాల్సిన టైములో పరిస్థితి పూర్తిగా మారిపోవటం తో లబోదిబోమంటున్నారు. సినిమా ధియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో నెక్స్ట్ రిలీజ్ కావాల్సిన సినిమాల నిర్మాతలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలావరకు నిర్మాతల కన్ను OTT పై పడింది. దీంతో భవిష్యత్తులో సినిమాలు చాలా వరకూ OTT ద్వారానే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఒక పక్క సినిమా థియేటర్ పరంగా అయినా గాని మరోపక్క భవిష్యత్తులో OTT వల్ల అయినా గాని దెబ్బ మాత్రం ఎక్కువగా పైరసీ వల్ల జరగటం గ్యారెంటీ అని సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అనుకుంటున్నారు.

 

దీంతో ముందుగా పైరసీని ఏ విధంగా ఆపాలో అన్న దాన్ని విషయంపై ఆలోచిస్తున్నారు. పైరసీ అనే ఈ భూతం అన్ని ఇండస్ట్రీలకు పెద్ద సమస్యగా ఉండటంతో ఎలాగైనా అరికట్టడానికి అనేక మార్గాలు ఎప్పటినుండో అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా తమిళ సినిమాల హీరోలు చేస్తున్న కొత్త సినిమాలు విడుదలైన ఒకటి రెండు రోజుల్లోనే  ఆన్‌లైన్‌లో తమిళ రాకర్స్‌ ద్వారా వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీ ద్వారా రిలీజ్ చేసినా కూడా కోట్లల్లో నష్టం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

 

ముందుగా ఓటీటీ పై కాకుండా పైరసీ ని ఏవిధంగా అరికడితే బాగుంటుందో ఆలోచిస్తే బాగుంటుందని వాళ్ళని ఆపే వాళ్ళే ప్రజెంట్ లేరా అని తెగ మదనపడుతున్నారు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు. భవిష్యత్తులో ఓటీటీ ద్వారా సినిమా రిలీజ్ అయితే కొద్ది గంటల్లోనే ఆన్లైన్ లో వచ్చే అవకాశం ఉందని అది ఇంకా ప్రమాదకరమని టెన్షన్ పడుతున్నారు. మరోపక్క లాక్ డౌన్ ఈనెల 17తో ముగుస్తున్నా గాని సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేకపోవడంతో వేసవికి రిలీజ్ అవ్వాల్సిన సినిమాల నిర్మాతలు బ్యాంకులకు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ లు కడుతూ బాగా నష్టపోతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: