టాలీవుడ్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. బాహుబలి సినిమా తర్వాత అతని క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది అనేది వాస్తవం. బాహుబలి సినిమా తో అతను బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ కెరీర్ ఇంకా ఎన్నేళ్లు ఉన్నా బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలకు ముందు ... ఆ తర్వాతే అని విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రభాస్‌కు బాలీవుడ్లో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అతను లవర్ బాయ్ లా కనపడే అవకాశం ఉంది.
ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా తర్వాత అశ్వనీదత్ నిర్మాతగా ఒక సినిమాను ప్లాన్ చేశాడు. ఆ సినిమాను మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాను కూడా వచ్చే ఏడాది మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రభాస్ భారీగా డిమాండ్ చేసాడు అని అంటున్నారు. ఈ సినిమా కోసం రు. 90 కోట్లు అడిగినట్టు సమాచారం. ఈ సినిమా డేట్స్ పూర్తిగా అతను ఇవ్వలేదు అని చెప్పినట్టు తెలుస్తుంది.
అతను బాలీవుడ్ దర్శకుడి తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను కూడా అప్పుడే మొదలుపెడుతున్నాడు కాబట్టి డేట్స్ విషయంలో అప్పుడే స్పష్టత ఇస్తా అని చెప్తున్నట్టు సమాచారం. ఇది నిర్మాతకు కాస్త ఇబ్బంది లాంటిదే. ఇక ఈ సినిమా కథ కూడా ఇప్పుడు దాదాపుగా పూర్తి అయినట్టు సమాచారం. కథలో కొన్ని కోణాలు ఉంటాయని ఆ కోణాలకు సంబంధించి స్పష్టత వస్తుంది అని అంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభ మవుతుందని నిర్మాత అశ్వనీదత్ తాజాగా ప్రకటించారు.