నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ కు కొదవ లేదు. కుటుంబ కథలతో పాటు మాస్ కథాంశాలను కూడా బాలకృష్ణ పర్ఫెక్ట్ గా రాణించాడు. బాలకృష్ణకు మాస్ ఇమేజ్ తో వచ్చిన హిట్ సినిమాల్లో ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ కూడా ఒకటి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ రోరింగ్ పెర్ఫార్మెన్స్ చేసాడనే చెప్పాలి. ఈ సినిమా విడుదలై నేటితో 28 ఏళ్లు పూర్తయ్యాయి. బాలకృష్ణ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిపోయింది రౌడీ ఇన్ స్పెక్టర్. సక్సెస్ ఫుల్ డైరక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1992 మే7వ తేదీన విడుదలైంది.

IHG

 

నందమూరి అభిమానులను అలరించిన ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు. బాలయ్య గెటప్ కూడా పర్ఫెక్ట్ గా సూటయ్యింది. పుష్పానంద్ అందించిన కథకు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. ఇన్ స్పెక్టర్ గా విలన్లతో తలపడే సీన్లలో బాలయ్య డైలాగులకు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా విజయశాంతి నటించింది. ఆటో రాణిగా విజయాశాంతి హీరోతో సమానమైన క్యారెక్టర్ చేసింది. సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ బప్పీలహరి సంగీతం అందించారు. పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ప్రతి పాట థియేటర్లలో మోగిపోయాయి.

IHG

 

విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై టి. త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. బాలయ్య కెరీర్లో మరో శతదినోత్సవ సినిమాగా రౌడీ ఇన్ స్పెక్టర్ నిలిచిపోయింది. 35 సెంటర్లలో 100 రోజులు ఆడింది. తమిళ్ లో ఈ సినిమాను ఆటో రాణిగా డబ్ చేశారు. అప్పటికే లారీ డ్రైవర్ తో బాలయ్య – బి.గోపాల్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కు తగ్గట్టే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: