మొన్నటి వరకు రాజకీయాలలో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సరిగ్గా కరోనా వైరస్ రాకముందు సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు సగానికిపైగా అయిపోయిన తరుణంలో కరోనా వైరస్ రావడంతో లాక్ డౌన్ అమలు చేయడంతో షూటింగ్ లో మొత్తం ఆగిపోయాయి. ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ కూడా ఆగిపోవడం జరిగింది. ఈ విషయం పక్కన పెడితే రేణు దేశాయ్ కి మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఎప్పటినుండో మాటలు లేవు. విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. మెగా ఫ్యామిలీ కి చాలా వరకు పూర్తిగా దూరంగా ఉన్నా రేణుదేశాయ్ తన స్వస్థలం పూణేలో ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిమానులకు అందుబాటులో ఉంటూ అనేక విషయాల గురించి తన పిల్లలు గురించి చెప్పుకోస్తుంది.

 

ఇదిలా ఉండగా ఇటీవల రేణుదేశాయ్ తో ఇంటర్వ్యూ లో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా న్యూస్ యాంకర్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్థావన తీసుకు వచ్చారు. మీరు సినిమాల్లోకి రావాలనుకుంటున్నారు. మీరు డైరెక్ట్‌ కూడా చేయాలని భావిస్తున్నారు. కనుక పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో లీడ్‌ రోల్‌ చేయడం కాని లేదంటే ఆయన సినిమాకు డైరెక్ట్‌ చేయడం  చేసే అవకాశం ఉందా అంటూ యాంకర్‌ ప్రశ్నించాడు.

 

దీంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా ఇంటర్వ్యూ చేయలేరా… నేను డైరెక్షన్ చేస్తే ఆయన హీరో అయితే ఇదోక కాన్సెప్ట్ పెట్టుకొని టిఆర్పి రేటింగ్ లు సాధించాలి అనుకుంటున్నారా అని ఆమె సీరియస్ అయింది. ఆయనతో సినిమా చేసే ఉద్దేశ్యం లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో రేణుదేశాయ్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: