సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. 'ప్రస్థానం' సినిమాతో సందీప్ కిషన్ సినీ ప్రస్థానం మొదలైంది. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. స్నేహగీతం, రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్సప్రెస్, జోరు, బీరువా, శమంతకమణి, మనసుకు నచ్చింది, టైగర్, డీ ఫర్ దోపిడీ, నిను వీడని నీడను నేను, తెనాలి రామకృష్ణ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అంతేకాకుండా 'షోర్‌ ఇన్‌ ద సిటీ' అనే బాలీవుడ్ చిత్రంలో కూడా నటించాడు సందీప్ కిషన్. దీంతోపాటు 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కిషన్ కెరీర్ బిగినింగ్ నుండి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ నరగసూరన్ అనే ఓ తమిళ సినిమాలో నటించాడు. ఈ సినిమా తెలుగులో ‘నరకాసురుడు’గా రాబోతోంది. 

 

తెలుగులో 'ఏ 1 ఎక్సప్రెస్' సినిమా చిత్రీకరణ దశలో ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం సందీప్ సిక్స్ ప్యాక్ సిద్ధం చేశారు. స్పోర్ట్స్ మెన్ లుక్ కోసం ఆయన కస్టపడి బరువు తగ్గాడు. సిక్స్ ప్యాక్ బాడీ లో సందీప్ లేటెస్ట్ లుక్ కేక పుట్టించేలా ఉంది. సౌత్ ఇండియాలోనే హాకీ పై వస్తున్న ఫస్ట్ మూవీ ఏ వన్ ఎక్ష్ప్రెస్స్ కావడం విశేషం. దర్శకుడు డెన్నిస్ జీవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి సందీప్ కిషన్ కి జంటగా నటిస్తుంది. దీంతో పాటు 'కచడతపర' అనే రెండు తమిళ చిత్రాలలో సందీప్ నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆపేసుకున్న ఈ సినిమాలు లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే స్టార్ట్ కానున్నాయి.  పదేళ్లుగా మంచి కమెర్షియల్ హిట్ కోసం ట్రై చేస్తున్న సందీప్ కిషన్ ఈ సినిమాలతో అయినా విజయం సాధిస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: