ఓవర్ నైట్ స్టార్ హీరోల అంటే టక్కున వినిపించే పేరు  విజయ్ దేవరకొండ.. పెళ్లి చూపులు సినిమాతో  హీరోగా ఎంట్రీ ఇచ్చిన కూడా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కేవలం ఒక్క సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాడు.. అందుకే విజయ్ పేరు అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే.. 

 

 

 

 

 

గీత గోవిందం సినిమా తో మంచి హిట్ ను అందుకున్న ఈ హీరో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల విడుదల అయిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అనుకున్నంత హిట్ నీ అందుకోలేదు.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైనది.. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయి ఇళ్లకే పరిమితమయ్యారు.. 

 

 

 

 

 

ప్రస్తుతం భారత ప్రజలు ఎదుర్కొంటున్న కరోనా నుంచి ప్రజలను కాపాడాటనికి విజయ్ తన వంతు సాయన్ని  చేస్తున్నారు.. కేవలం ప్రజలకే కాదు ప్రజలకు కాపాడుతున్న పోలీసులకు అనుక్షణం కాపాడుతూ వస్తున్నారు.. కరోనా నుంచి వారిని కాపాడటానికి రక్షణ కవచాలు అందజేసి అందరి మనసును దోచేశారు... 

 

 

 

 

 

ఇది ఇలా ఉండగా కరోనా సమస్య పెరుగుతూ ఆంధ్రప్రదేశ్ ను కదిలించి వేస్తుంది... ఆ దెబ్బ పూర్తిగా మరువక ముందే మరొక సమస్య వచ్చి పడింది.. విశాఖ లోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి ప్రమాదకరమైన గ్యాస్ లీకై ఎనిమిదిమంది మరణించారు..ఈ విషయం పై సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు .. తాజాగా ఈ విషయం పై విజయ్ దేవరకొండ స్పందించాడు.. వైజాగ్ గురించి తాము ఆలోచిస్తున్నామని, ప్రార్థిస్తున్నామంటూ ఓ ట్వీట్ చేశాడు. విశాఖలోని గోపాలపట్నం ప్రాంతానికి ‘జటాయు’ బృందం సభ్యులు చేరుకున్నారని, ఎవరికైతే ఆహారం, వసతి అవసరం ఉందో వారు తమ సభ్యులకు ఫోన్ చేయాలంటూ రెండు ఫోన్ నంబర్లు 7799439129, 6303616240  తెలియజేశారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: