వన్ ఎపుడూ వన్ గానే ఉంటుంది. విన్ కావాలంటే వన్ కావాలని అంటారు. అందుకే వన్ అంటే అంత లవ్. నంబర్ వన్ అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ ప్లేస్ కి చేరుకోవడం కష్టం. ఒకసారి చేరుకున్నాక నిలబెట్టుకోవడం మరీ కష్టం. అందుకే నంబర్ వన్ అంటే మోజు అలాగే ఉంటోంది

 

టాలీవుడ్లో తీసుకుంటే ఇపుడు నంబర్ వన్ ప్లేస్ అలాగే కాళీగానే ఉంది. నిజానికి చాలాకాలంగా నంబర్ వన్ ప్లేస్, రేసూ కూడా ఊసు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే ఎందరో హీరోలు ఉన్నారు. అందరు హీరోలూ ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. ఒక సినిమా హిట్ అయితే రెండవ సినిమా ఫట్ అవుతోంది. కంటిన్యూస్ గా వరస హిట్లు ఇవ్వలేకపోతున్నారు.

 

ఈ లోగా మరో హీరో వచ్చి హిట్ కొట్టేస్తున్నాడు. ఇక మార్కెట్ పరంగా నంబర్ వన్ అందామా అంటే సినిమా సినిమాకూ అదీ మారుతోంది. ఇక వసూళ్ళ పరంగా నంబర్ వన్ ప్లేస్ ని డిసైడ్ చేయాలనుకున్నా కూడా ఒక సినిమాకు బంపర్ హిట్ కొట్టి వంద కోట్ల మార్క్ రీచ్ అయితే తరువాత సినిమా సగం కూడా చేయడంలేదు.

 

ఇలా ఎవరికి వారు నంబర్ వన్ తాము అని అనుకుంటున్నా ఆ చైర్ మాత్రం అలాగే ఖాళీగా ఉంది. గతంలో అయితే చిరంజీవి నంబర్ వన్ స్టార్ గా ఉండేవారు. ఆయన వరస సినిమాలు చేసేవారు, సినిమా సినిమాకు కలెక్షన్లు పెంచుకునేవారు. అంతే కాదు, మార్కెట్ రేంజి కూడా పెరుగుతూ వచ్చింది. ఒకటి రెండు సందర్భాల్లో పక్క హీరోలు పోటీ ఇచ్చేందుకు చూసినా చిరంజీవి రెట్టింపు హిట్ తో మళ్ళీ తన పొజిషన్ కన్ఫర్మ్ చేసుకునేవారు.

 

ఇలా చిరంజీవి కొన్నేళ్ళ పాటి టాప్ చైర్లో కూర్చుని తానే నంబర్ వన్ అని నిరూపించారు. ఆయన తరువాత ఆ చైర్ మాది అని ధీమాగా ఎవరూ  చెప్పలేకపోతున్నారు. ఓ విధంగా చెప్పుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ నంబర్ వన్ స్టార్ చిరంజీవి మాత్రమేనని అనుకోవాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: