మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం "క్రాక్‌". డాన్‌ శీను, బ‌లుపు వంటి కమర్షియల్ హిట్ సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ కోసం ట్రై చేస్తున్నారు. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ ఈ సినిమాతో హిట్ కొట్టాలన్న కసితోను ఉన్నాడు. దాంతో ఈ సినిమా విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నాడట రవితేజ. ఇక రవితేజసినిమా విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఎడిటింగ్ చాలా పక్కాగా చూస్తున్నాడట. రాజా ది గ్రేట్ తర్వాత మళ్ళీ రవితేజ కి హిట్ రాలేదన్న సంగతి తెలిసిందే.

 

ఇక ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్స్ తో క్రాక్ సినిమా మీద అంచనాలు భారీగా నెలకొన్నాయి. జూలై లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితిని బట్టి జూలై మూడోవారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కంప్లీట్ చేసి రెడీ కానున్నారట. ఇక శృతిహాసన్ చాలా కాలం తర్వాత మళ్ళీ "క్రాక్‌" సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రవితేజ తో శృతిహాసన్ బలుపు సినిమాలో నటించి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా నటిస్తుంది. నెగిటివ్ రోల్ లో మటిస్తున్న వరలక్ష్మి ఈ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకోనుందని అంటున్నారు. 

 

ఇప్పటికే తెలుగులో ఇప్పటికే తెనాలి రామకృష్ణ సినిమాలో లేడీ విలన్ గా నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వరలక్ష్మి చాలా పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతుందట. ఇక ఇదే సినిమాలో సముద్ర ఖని కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడైన సముద్ర ఖని తమిళ సినిమాలలో నటుడిగాను పాపులర్ అయ్యాడు. అంతేకాదు రవితేజ క్రాక్ లో కూడా నటిస్తున్నాడు. ఇందులో భాగంగా రీసెంట్ గా క్రాక్ సినిమానుండి సముద్ర ఖని లుక్ ని రిలీజ్ చేశారు. కొన్ని రోజుల గ్యాప్ లోనే వరలక్ష్మీ లుక్, సముద్ర ఖని లుక్ లని రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెంచారు. ఇక ఈ సినిమా ర‌వితేజ‌ కి కిక్ లా మళ్ళీ రికార్డ్స్ క్రియోట్ చేయడం ఖాయం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: