బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత తెలుగులో చాలా సినిమాలు పాన్ ఇండియా కేటగిరీలోనే తయారవుతున్నాయి. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టిస్టారర్ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు నటిస్తున్నారు. ఫిక్షన్ కథ తో రూపొందుతున్న ఈ సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతా రామరాజుగా ఎన్.టి.ఆర్ కొమరం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ హీరో అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2021 జనవరి 8 న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

ఇక కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య తెరకెక్కుతుండగా... మెగా పవర్ స్టార్ రాం చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవదాయ దర్మదాయ శాఖలో జరుగుతున్న అవినీతి ప్రధాన అంశంగా రూపొందిస్తున్నారు. 2021 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.  అంతేకాదు రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ తయారవుతున్న సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగానే సిద్దం చేస్తునారు. 

 

సాహో తో నిరాశపరచిన ప్రభాస్ ఈ సారి భారీ సక్సస్ కొట్టాలన్న ప్లాన్ లో ఉన్నాడు. ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇక కే.జి.ఎఫ్ ఛాప్టర్ 2 కూడా పాన్ ఇండియా సినిమాగానే నిర్మిచారు. ప్రశాంత్ నీల్-యశ్ కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన కే.జి.ఎఫ్ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీ నటులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి సుజీత్ కాంబినేషన్ లో నిర్మించబోయో లూసీఫర్ రీమేక్ ని కూడా పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సుజీత్ స్క్రిప్ట్ ని అందుకు తగ్గట్టుగానే గానే రెడీ చేస్తున్నాడు. పొల్టికల్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమా రూపొందనుంది. ఇక పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ సినిమా కూడా నాలుగు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. 

 

దీంతో పాటు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న పుష్ప సినిమా 5 భాషల్లో భారీ సినిమాగా పాన్ ఇండియా టార్గెట్ గా రెడీ చేస్తున్నారు. ఇవే కాదు పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాని పాన్ ఇండియా కేటగిరీలోనే రూపొందిస్తున్నారు. ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక సక్సస్ ఫుల్ కాంబో కమల్ హాసన్ శంకర్ ల భారతీయుడు 2 కూడా పాన్ ఇండియా సినిమాగానే రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాల మీద కరోనా ఎఫెక్ట్ ఏమాత్రం ఉండబోదన్న ధీమాగా మేకర్స్ ఉన్నారు. ఒకవేళ ఈ సినిమాలు గనక భారీ సక్సస్ లను అందుకుంటే మాత్రం కొంతవరకు చిత్ర పరిశ్రమ గాడిలో పడ్డట్టే అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: