మల్టీ స్టార్ అనేది అందరూ మహేష్ బాబు, వెంకటేష్ తో కలిసి స్టార్ అయ్యింది అనుకుంటున్నారు.. కానీ అలా అనుకునే వాళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు కాదు ఒకప్పుడే అంటే 1960 లో.. 1970స్ లోనే తెలుగు సినిమా రెండు కళ్లుగా చెప్పుకునే ఎన్టీఆర్.. ఏఎన్ఆర్ గారు కలిసి డజన్ సినిమాలకుపైగా మల్టీ స్టార్ మూవీస్ చేశారు అని. 

 

అయినా ఎన్టీఆర్.. ఏఎన్ఆర్ రీల్ లైఫ్ లో మనకు ఎలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా కనిపిస్తారో అలానే రియల్ లైఫ్ లో వాళ్ళు బెస్ట్ ఫ్రండ్స్. అందుకే అన్ని మల్టి స్టార్ సినిమాలు చేసారు.. వారు కలిసి సినిమా చేస్తున్నారు అని బయట సమాచారం అందింది అంటే నందమూరి.. అక్కినేని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరాలు చేసుకునే వారు.. 

 

ఇంకా ఆ తర్వాత 1980స్ లో.. 1990స్ లో నాగార్జున, కృష్ణ వంటి వారు కలిసి మల్టి స్టార్ సినిమాలు అక్కడ అక్కడక్కడా చేస్తూ వచ్చారు.. కానీ ఎన్టీఆర్.. ఏఎన్ఆర్ కలిసి నటించిన అన్ని మల్టి స్టార్ సినిమాలు ఇప్పటి వరుకు ఏ హీరో చెయ్యలేదు.. అంత అద్భుతమైన కాంబినేషన్ వాళ్ళది.. తెలుగు చరిత్రకు ప్రాణం పోసిన ఈ హీరోల.. మల్టి స్టార్ సినిమాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14. అన్ని సినిమాలలో ఏ హీరో అయితే మల్టి స్టార్ చేస్తాడు ఇప్పుడు. ఇంకా అలాంటి సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

పల్లెటూరి పిల్ల, సంసారం, రేచుక్క, పరివర్తన, మిస్సమ్మ, తెనాలి రామ కృష్ణ, చరన దాసి, మాయ బజార్, భూకైలాస్, గుండమ్మ కథ, శ్రీ కృషార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త, రామ కృష్ణ కుమార్, సత్యం శివమ్. ఇన్ని సినిమాల్లో కలిసి నటించారు వారి ఇద్దరు.. అలా కలిసి నటించిన 14 సినిమాలల్లో దాదాపు 8 సినిమాలకు పైగా అందులో మహానటి సావిత్రి గారు కూడా నటించారు.. అంటే అప్పట్లో గ్రేట్ కదా! 

మరింత సమాచారం తెలుసుకోండి: