‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ తరువాత త్రివిక్రమ్ తాను చేయబోయే మూవీని జూనియర్ ఎన్టీఆర్ తో ఖరార్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడ ఇంచుమించు పూర్తి అయింది. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్ ల సెటైర్లతో రాజకీయాల నేపధ్యంలో ఉండే ఈ వెరైటీ కథకు ‘పోయి రావాలి హస్తినకు’ అన్న టైటిల్ కూడ త్రివిక్రమ్ ఆలోచనలలో ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీని ఈ ఏడాది జూలై ఆగష్టు ప్రాంతాలలో మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలి అన్న యాక్షన్ ప్లాన్ లో త్రివిక్రమ్ ఆలోచనలు మొదటి నుంచి ఉన్నాయి. 


అయితే కరోనా సమస్యలతో షూటింగ్ లు ఆగిపోవడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వడం కష్టం అన్న అంచనాలు వస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ తిరిగి షూటింగ్ లు ప్రారంభం అయ్యాక కూడా ఖాళీగా ఎటువంటి పని లేకుండా కనీసం ఆరు నెలల నుండి ఎనిమిది నెలల వరకు జూనియర్ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితులలో జూనియర్ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టి ఈ గ్యాప్ లో వెంకటేష్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు రావడంతో త్రివిక్రమ్ ఇప్పటికే వెంకటేష్ తో రాయబారాలు చేసాడు అన్న వార్తలు వచ్చాయి. 


అయితే ఈ విషయం తెలుసుకుని జూనియర్ త్రివిక్రమ్ కు మైండ్ వాష్ చేయడంతో త్రివిక్రమ్ వెంకీ మూవీ ఆలోచనలు పక్కకు పెట్టాడు. అయితే ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న ‘నారప్ప’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కరోనా సమస్యలు రాకుండా ఉండి ఉంటే ఈ పాటికి ఈ సినిమా షూటింగ్ కూడ పూర్తి అయిపోయేది. ప్రస్తుతం వస్తున్న అంచనాల ప్రకారం జూన్ నెలలో మళ్ళీ షూటింగ్ లు మొదలవుతాయి అని అంటున్నారు. 


అదే నిజం అయితే వెంకటేష్ తన ‘నారప్ప’ మూవీకి సంబంధించి మిగిలి ఉన్న 20 రోజుల పెండింగ్ షూటింగ్ ను వేగంగా పూర్తిచేసి వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే త్రివిక్రమ్ కు భారీ ఆఫర్లు కూడ ఇస్తున్నట్లు టాక్. ఒకవేళ త్రివిక్రమ్ నిర్ణయం రాకపోతే తాను అనీల్ రావిపూడి ‘ఎఫ్ 3’ వైపు వెళ్ళిపోతాను అని వెంకటేష్ త్రివిక్రమ్ పై వ్యూహాత్మక ఒత్తిడి పెంచి నట్లు తెలుస్తోంది. దీనితో ఇచ్చిన మాట ప్రకారం జూనియర్ కోసం నెలలు తరబడి వేచి ఉండటమా లేకుంటే కాంపౌండ్ లోకి వచ్చిన కోట్ల భారీ ఆఫర్ ను ఎంచుకోవడమా అనే విషయం పై త్రివిక్రమ్ టోటల్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు టాక్.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: