సీనియర్ నటుడు మురళీ మోహన్ ఎవర్ని బాధ పెట్టే కామెంట్స్ చేయడు. దీనితో ఇండస్ట్రీ వర్గాలలో అతడిని అజాతశత్రువు గా చూస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ పరిస్థితులలో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన మురళీ మోహన్ ఇండస్ట్రీ పరిస్థితుల పై ప్రస్తుత రాజకీయాల పై మాట్లాడుతూ మధ్యలో తనకు ఎదురైన పవన్ కళ్యాణ్ ఫిలిం రీ ఎంట్రీ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


సినిమా వాళ్ళు రాజకీయాలలో రాణిస్తారా అన్నవిషయమై ప్రస్తుత పరిస్థితులలో స్పష్టమైన సమాధానం లేదనీ ఎన్టీఆర్ కు నీరాజనాలు పలికి అధికారాన్ని కట్టబెట్టిన తెలుగు ప్రజలు ఇప్పుడు సినిమా హీరోలు రాజకీయాలలోకి వస్తే అధికారం వెంటనే కట్టపెడతారు అన్న సూచనలు తనకు కనిపించడం లేదనీ కామెంట్స్ చేసాడు. ప్రజలకు అలాంటి ఉద్దేశాలు ఉంటే చిరంజీవి ‘ప్రజారాజ్యం’ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ఎన్నికలలో ఓడిపోయి ఉండేవి కాదు అనేది తన అభిప్రాయం అంటూ వ్యాఖ్యానించాడు. 


అయితే పవన్ కళ్యాణ్ లో మాత్రం ఒక ఫైర్ ఉందనీ ఎప్పటికైనా ఆ ఫైర్ ను జనం గుర్తిస్తే పవన్ కళ్యాణ్ కు మంచి రాజకీయ భవిష్యత్ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ కామెంట్ చేసాడు. ఇదే సందర్భంలో పవన్ ఫిలిం రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాల సమయం పడుతుందని అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా సినిమాలలో నటిస్తూ ‘జనసేన’ పార్టీని బతికించే విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయం తనకు నచ్చింది అని అంటున్నాడు.


అనేకమంది విమర్శకులు పవన్ రెండు పడవల సిద్ధాంతాన్ని విమర్శిస్తున్న పరిస్థితులలో మురళీ మోహన్ మాత్రం పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతించడం ఇక్కడి ట్విస్ట్. లాక్ డౌన్ కారణంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉండిపోయినా తన జనసేన కార్యకర్తలను నిరంతరం ఉత్సాహ పరుస్తూ కరోనా సమస్య పైన నిన్న విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన పైనా స్పందిస్తూ తన కార్యకర్తలతో సేవా కార్యక్రమాలు చేయిస్తున్న పరిస్థితులలో మురళీ మోహన్ చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు మరింత జోష్ ను కలిగిస్తాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: