టాలీవుడ్ లో వెంకటేష్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అగ్ర హీరో అయినా సరే ఎలాంటి పాత్రలో నటించడానికి అయినా సరే వెంకటేష్ మాత్రం వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం. తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో అతను కీలక పాత్రలు చేసి హీరో అంటే ఇలాగే ఉండాలి అనే దానికి చరమ గీతం పాడి ప్రయోగాలు కూడా చేస్తూ వచ్చాడు. తన కెరీర్ లో చేసిన సినిమాల్లో ఎక్కువగా ప్రయోగాలే ఉన్తాఉఇ అనే విషయం తెలిసిందే. ఏ సినిమా చేసినా సరే ప్రేక్షకులకు కొత్తదనం అందించే ప్రయత్నం వెంకీ చేస్తూ ఉంటాడని టాలీవుడ్ జనాలు అంటారు. 

 

మల్టీ స్టారర్ సినిమాల కోసం ఏ హీరో ముందుకు వచ్చినా రాకపోయినా వెంకటేష్ మాత్రం చేయడానికి ముందుకు వస్తు ఉంటాడు. ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు. దర్శక నిర్మాతలు కథ చెప్తే ఆ కథలో తన పాత్ర స్థాయి తగ్గినా సరే వెంకటేష్ మాత్రం అందులో ఎక్కడా కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అయినా ఎఫ్ 2 సినిమా అయినా రామ్ తో చేసిన ఒక సినిమా అయినా పవన్ కళ్యాణ్ తో చేసిన గోపాల గోపాల సినిమా అయినా సరే వెంకటేష్ చాలా సన్నివేశాల్లో తన స్థాయి తగ్గించుకుని చేసినవి ఎక్కువగానే ఉన్నాయి అనేది వాస్తవం. 

 

ఏ సీన్ లో అయినా సరే అతను మాత్రం ఇబ్బంది పడకుండా నటిస్తూ ఉంటాడు అనేది అందరికి తెలిసిందే. అందుకే మల్టీ స్టారర్ సినిమాలు అనగానే వెంకటేష్ పేరు చాలా మందికి గుర్తుకు వస్తు ఉంటుంది. ఈ తరంలో ఆయనే మల్టీ స్టారర్ సినిమాలకు బెస్ట్ అనేది స్పష్టంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: