నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసే సినిమాల్లో ఎన్టీఆర్ బాలకృష్ణ సినిమా. వీరి కాంబినేషన్ లో ఒక్క సినిమా రావాలి అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. వీరి కాంబినేషన్ లో సినిమా రావాలని ఎప్పటి నుంచో నందమూరి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అగ్ర దర్శక నిర్మాతలు సినిమా వీరితో చెయ్యాలి అని చూసినా సరే వీరు ఇద్దరూ కూడా ముందుకు రావడం లేదు. కథ ఏ విధంగా ఉన్నా సరే సినిమా చేయడానికి ఇద్దరూ కూడా ఆసక్తి చూపించడం లేదు. దీనికి కారణం ఏంటీ అనేది వారి ఇద్దరికే తెలియాలి. 

 

ఈ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మించే అవకాశం ఉంది వచ్చేస్తుంది అని వార్తలు వస్తున్నా సరే ఇద్దరూ మాత్రం స్పందించడం లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు మల్టీ స్టారర్ గా వచ్చినా సరే వాటికి లేని క్రేజ్ ఈ సినిమాలకు ఉంది. టాలీవుడ్ జనాలు ఇప్పుడు కొత్తదనం కోరుకునే క్రమంలో ఎన్నో సినిమాలను హీరోల నుంచి ఆశిస్తున్నారు అనేది అర్ధమవుతుంది. అయినా సరేఈ ఇద్దరు మాత్రం కలిసి ఒక్క సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. బాలయ్య ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు గాని, 

 

ఎన్టీఆర్ మాత్రం ఆసక్తి చూపించడం లేదు అనే వ్యాఖ్యలు ఎన్నో వినపడుతున్నాయి. ఎన్టీఆర్ మాత్రం అసలు ఈ సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడట౦ లేదని బాలకృష్ణ స్వయం గా అడిగినా సరే ఎన్టీఆర్ నుంచి మాత్రం ఏ స్పందనా లేదనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరూ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. మరి వీరి కాంబినేషన్ లో  సినిమా ఎప్పుడు వస్తుందా అనేది చూడాలి. వీరిద్దరికీ ఎప్పుడు సమయం దొరుకుతుందో కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: