2013వ సంవత్సరంలో విడుదలైన మసాలా సినిమాలో దగ్గుబాటి వెంకటేష్, రామ్ పోతినేని కలిసి నటించారు. మసాలా మూవీ హింది లో 2012 వ సంవత్సరంలో విడుదలైన 'బోల్బచ్చ్చన్' అనే సినిమాకి రీమేక్. 2013వ సంవత్సరంలో రిలీజ్ ఐన మసాలా మూవీ సినీ విమర్శకుల మన్నలను పొందింది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది. ఈ చిత్రంలో వెంకటేష్ నటన అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.


బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడుతూ వెంకటేష్ చెప్పిన డైలాగులు... అంజలి తో తాను ప్రేమలో పడే సన్నివేశాలు... కోవై సరళకి ఆయనకి మధ్య ఉండే సీన్స్ అన్ని చూడదగ్గవి. రామ్ పోతినేని కూడా ద్విపాత్రాభినయం చేసి అందరిని బాగా అలరించాడు. రామ్ సరసన నటించిన నటీమణి షాజాన్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. వెంకటేష్ ప్రతి కుర్ర హీరో పక్కన రెండవ హీరోగా నటించేందుకు ఆసక్తి చూపారు. మసాలా సినిమా తర్వాత చాలా సినిమాల్లో వెంకటేష్ తన వయసుకు తగ్గట్టుగా కుర్ర హీరోల పక్కన నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ తన పాపులారిటీని ఇప్పటికీ తారా స్థాయిలోనే ఉంచుకుంటున్నాడు.


మసాలా సినిమా కథ గురించి ఒకసారి తెలుసుకుంటే... భీమ రాజపురం లో బలరామ అనే ఒక గొప్ప మనసు కలిగిన వ్యక్తి నివసిస్తుంటాడు. అన్ని విషయాల్లో తన ఊరి ప్రజలను మంచిగా చూసుకునే బలరాం ఒక విషయంలో మాత్రం చాలా కఠినాత్మకంగా ఉంటాడు. అదేంటంటే అబద్ధాలు చెప్పడం. ఎవరైనా తనని మోసం చేసినా, తనకి అబద్ధాలు చెప్పినా సహించలేడు బలరాం. అటువంటి వ్యక్తి దగ్గరికి రెహమాన్(రామ్ పోతినేని) తన సోదరి అయిన సానియా(అంజలి) తో వస్తారు. వీళ్లిద్దరూ బలరాం ని మోసం చేస్తూ ఉంటారు. చివరికి నిజం తెలిసిన బలరాం వీరిని ఏం చేస్తారన్నది సినిమాల్లో చూపిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: