దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి మందు బాబులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.  హాయిగా సాయంత్రం కాస్త మందు తాగి జీవితానికి ఇంతకన్నా ఆనందం ఉందా అని భావించేవారు నలభై రోజుల పాటు సుక్క మందు లేక నానా అవస్థలు పడ్డారు.  ఇక అడ్డదారుల్లో మందు దొరికినా సుక్కలంటే ధరలు. దాంతో అటు మందు కొనలేక.. అధిక ధరలు పెట్టి కొనలేక ఎన్నో అగజాట్లు పడ్డారు. చివరికి పిచ్చివాళ్లయ్యారు.. ఉన్మాదులుగా మారారు.. ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డ మందు బాబులకు కేంద్రం శుభవార్త చెప్పింది.  ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి రెడ్ జోన్ లో తప్ప గ్రీన్, ఆరెంజ్ జోన్లో మందు విక్రయం జరపవొచ్చు అని తెలిపారు.  సాధారణంగా ఓట్లు వేసేటపుడు చేతిపై సిరా చుక్క వేయడం ఆనవాయితీ.. ఇప్పుడు ఇదే తంతు కొనసాగుతుంది మందుబాబులకు.

 

లిక్కర్ కోసం వైన్ షాపునకు వెళ్లిన వారికి రంగు పడుతోంది. మద్యం తీసుకున్నవారికి వేలికి సిరా చుక్క పెట్టిమరీ పంపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు ఈ వినూత్న పద్దతికి తెరలేపారు.  రద్దీని తగ్గించడం కోసమే ఈ విధంగా చేస్తున్నట్టు చెబుతున్నారు. దీని ద్వారా ఒకసారి వచ్చిన వారు మరో మూడు రోజుల వరకు రాకుండా ఉంటారని అంటున్నారు.  ఇలా చేయడం వల్ల ఒక్కసారి వచ్చిన వారు పదే పదే రాకుండా ఉండటంతో రద్దీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు.

 

ఈ ఆలోచన బాగుందంటూ పలువురు అధికారుల తీరును ప్రశంసిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించి 45 రోజుల తర్వాత మద్యం షాపులు తెరవడంతో మందు బాబులు లిక్కర్ షాపుల ఎదుట క్యూ కట్టారు.  ఇదిలా ఉంటే..  కడలూరు వైన్ షాపు ఊహించని విధంగా గిన్నీస్ రికార్డు కి ఎక్కింది. అక్కడ ఏకంగా 3 కిలోమీటర్ల మేర మందుబాబులు లిక్కర్ కోసం నిలబడటమే కారణం.  

మరింత సమాచారం తెలుసుకోండి: