మామూలుగానే తెలుగు చిత్ర పరిశ్రమ లో మల్టీస్టారర్ సినిమాలకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అదే రియల్ లైఫ్ పాత్రలు రీల్ లైఫ్లో కూడా అభిమానులను అలరిస్తే  ఆ కిక్కే వేరే ఉంటుంది. అక్కినేని అభిమానులు అందరికీ ఇలాంటి కిక్కు చాలా సార్లు వచ్చింది అని చెప్పాలి. ఒకసారి మొత్తం అక్కినేని ఫ్యామిలీ మనం సినిమాలో నటించి అక్కినేని అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత చైతు హీరోగా తెరకెక్కిన ప్రేమమ్  సినిమాలో... వెంకటేష్ రియల్ లైఫ్ పాత్ర అయిన  చైతు మామ పాత్రలోనే సినిమాల్లో కూడా నటించారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ప్రేక్షకులు వెంకటేష్ ఎంట్రీ తో  ఉర్రూతలూగి పోయారు అని చెప్పాలి. రియల్ లైఫ్ పాత్రల్లోనే  మొన్నటికి మొన్న మరోసారి రీల్ లైఫ్లో రిపీట్ అయ్యాయి. 

 

 

 వెంకటేష్ నాగచైతన్య హీరోలుగా మల్టీ స్టారర్ తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వెంకటేష్ మామ గా నాగచైతన్య అల్లుడిగా నిజజీవితంలోని పాత్రలను సినిమాల్లో కూడా చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు వెంకటేష్ నాగ చైతన్య. వీరిద్దరి మల్టీ స్టారర్ సినిమాగా వచ్చిన వెంకీ మామ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మరోసారి ఇద్దరికీ రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది అని నిరూపించుకున్నారు మామా అల్లుళ్లు. మామూలుగానే ఈ మామా అల్లుళ్లు ఎక్కడైనా ఈవెంట్లో కానీ స్టేజ్ మీద కనిపించారు అంటే చాలు సరదాగా మాట్లాడుకుంటూ అభిమానులు అలరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక ఎప్పుడు అభిమానులను అలరించే మామా అల్లుళ్లు అటు సినిమాల్లో కూడా అదే పాత్రల్లో  నటించి మామా అల్లుళ్లు గా అలరిస్తే  అభిమానులకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అందుకే అటు అక్కినేని అభిమానులు ఇటు దగ్గుబాటి అభిమానులు వెంకీ మామ సినిమాతో పండుగ చేసుకున్నారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఏదేమైనా ఈ రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రీల్ లైఫ్లో కూడా తమకు తిరుగులేదు అని నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: