టాలీవుడ్ ఒక‌ప్ప‌టి హీరోల్లో శ్రీ‌కాంత్, వేణులు  ఒక రేంజ్‌లో ఉన్న హీరోల‌నే చెప్పాలి. ఈ ఇద్ద‌రూ  హీరోలు ఎవ‌రి రేంజ్‌కి త‌గ్గ‌ట్టు వారికి ఫ్యాన్స్ కూడా బాగానే ఉండేవారు. అప్ప‌ట్లో తెలుగు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా కుటుంబ‌క‌థా చిత్రాల‌ను ఇష్ట‌ప‌డేవారు. ఇక కుటుంబ‌క‌థా చిత్రాల‌కు కాస్త సెంటిమెంట్‌ని జోడించి తీసిన ప్ర‌తీ చిత్రం హిట్ అయింద‌నే చెప్పాలి. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్లో దాదాపు మూడు చిత్రాల్లో క‌లిసి న‌టించారు. వీరిద్ద‌రూ క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌లో చేసినా సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్లు కొట్టాయి.  ఒక‌టి పెళ్ళాం ఊరెళితే, మ‌రొక‌టి య‌మ‌గోల మ‌ళ్ళీ మొద‌ల‌యింది, ఇక శ్రీ‌కృష్ణ 2006 ఇలా మూడు చిత్రాలు మూడు ర‌కాలని చెప్పాలి. పెళ్ళాం ఊరెళితే చిత్రానికి ఎంత‌టి విజయం సాధించిందో తెలిసిందే. ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. టైటిల్ బట్టి పెళ్ళాం పుట్టింటికెళితే ఏం జరుగుతుందనే విషయాన్ని ఫన్నీగా దర్శకుడు ఎస్‌.వి. కృష్ణారెడ్డి చాలా మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రానున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఆ చిత్రం కూడా ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గానే తెర‌కెక్క‌నుంద‌ట‌. 

 

ఆ త‌ర్వాత వ‌చ్చిన `య‌మ‌గోల మ‌ళ్ళీ మొద‌లైంది` చిత్రం కూడా దాదాపు అదే త‌ర‌హాలో ఫుల్ కామెడీగా తెర‌కెక్కింది. కామెడీతో పాటు కాస్త ఆధ్యాత్మికం యాడ్ చేసి చేసిన చిత్రం `య‌మ‌గోల‌` శ్రీ‌నివాస్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ ముందు మంచి క‌లెక్ష‌న్లే సాధించింది. రీమాసేన్‌, మీరాజాస్మిన్ హీరోయిన్లుగా న‌టించారు. ఇందులో శ్రీ‌కాంత్ య‌ముడి పాత్ర‌లో న‌టిస్తే వేణు చిత్ర‌గుప్తుడి పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఈ చిత్రంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్ అప్ప‌ట్లో సూప‌ర్‌డూప‌ర్ హిట్ అనే చెప్పాలి. ఇక మూడో చిత్రం వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వచ్చిన చిత్రం శ్రీ‌కృష్ణ 2006. కె.వి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో డా.డి. రామానాయుడు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. యం.యం. శ్రీ‌లేఖ సంగీతాన్ని స‌మ‌కూర్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: