టాలీవుడ్ లో కొన్ని కొన్ని వార్తలు ఎప్పటికి అలా నిలిచిపోతు ఉంటాయి. అవి ఎప్పుడు వచ్చినా సరే... ప్రేక్షకులు ఎంతో నమ్మకం గా ఆశగా చదువుతూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే వార్త ఒకటి ఉంది. అది ఏంటీ అంటే బాలకృష్ణ చిరంజీవి కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనే వార్త. 2000 తర్వాత ఈ వార్త ఎక్కువగా టాలీవుడ్ లో వచ్చింది. వీరిద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి గానూ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అని కాని మంచి కథ దొరకడం లేదని అందుకు ఆగిపోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కథ బాగున్నా సరే ఒకరు ముందుకు రావడం లేదట. 

 

టాలీవుడ్ లో ఈ వార్త ఎప్పటి నుంచో షికారు చేస్తూనే ఉంది. బాలకృష్ణ, చిరంజీవి హీరోలు గా బీ గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా వచ్చే అవకాశం ఉందనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతుంది. అది రైతు సినిమా అని కూడా అనుకున్నారు గాని అది ముందుకు మాత్రం అడుగు పడలేదు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అసలు వస్తుందో రాదో కూడా స్పష్టంగా ఎవరికి తెలియదు. చిన్న చిన్న సినిమాల్లోనే ప్రయోగాలు చేస్తుంటే మంచి ఆదరణ ఉన్న ఈ ఇద్దరూ ఒక్క సినిమా చేయవచ్చు కదా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 

 

అగ్ర దర్శకులు ఇద్దరు ముగ్గురు వీరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయినా సరే వీరిద్దరూ మాత్రం ముందుకు రావడం లేదు. ఇప్పుడు మార్కెట్ పెరిగింది కాబట్టి ఈ సినిమా వస్తే మంచి ప్లస్ అవుతుంది అనేది వాస్తవం. మరి ఈ సినిమా వస్తుందో లేదో చూడాలి. ఇద్దరూ కూడా ఇప్పుడు వయసు మీద పడుతున్న హీరోలే కావడంతో వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: