టాలీవుడ్ లో ఒక్కో ఒక్కో సినిమాకు ఒక్కో రేంజ్ ఉంటుంది. చిన్న చిన్న హీరోల సినిమాల గురించి పక్కన పెడితే కొన్ని సినిమాలకు మాత్రం ప్రత్యేకంగా ఆదరణ ఉంటుంది వాటికి ఒక రేంజ్ ఉంటుంది అనేది వాస్తవం. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఇప్పుడు తమ సినిమాలు బాలీవుడ్ స్థాయిలో ఉండాలని, ఇండియన్ సినిమాలో తమ సినిమాలు నిలబడాలి అని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్క సినిమా కొత్తగా వచ్చినా చాలు మన ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు. ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలను మన ప్రేక్షకులు ఎకువగా కోరుకుంటున్నారు. 

 

ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలకు మంచి రోజులు వచ్చాయి అనేది వాస్తవం. అగ్ర హీరోల సినిమాల విషయంలో ఇప్పుడు మల్టీ స్టారర్ చర్చలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వీరు ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలకు ఒక ఊపు ఇస్తుంది అనేది చాలా మంది మాట. ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. చిన్న వార్త వచ్చినా సరే ప్రేక్షకులు దాన్ని ఎంతో ఆశగా చదువుతూ వస్తున్నారు. 

 

సినిమా తర్వాత తెలుగు సినిమా రేంజ్ చాలా వరకు పెరుగుతుంది అని అక్కడి నుంచి అగ్ర హీరోలు అందరూ కూడా ప్రయోగాలు చేయడమే కాదు కలిసి సినిమాలు చేయడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి దాని అంతట అదే వస్తుంది అని అంటున్నారు. మరి ఈ సినిమా తర్వాత ఎన్ని ప్రయోగాలు హీరోలు చేస్తారు అనేది చూడాలి. ఈ సినిమా దర్శకుడు రాజమౌళి కాబట్టి ఎలాగూ కచ్చితంగా హిట్ అవుతుంది. మరి ఇతర దర్శకులు అలా చేస్తారా...?

మరింత సమాచారం తెలుసుకోండి: