ప్రస్తుతం టాలీవుడ్ మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో లీడింగ్ లో ఉన్న వ్యక్తి సితార. ఒక‌ప్ప‌టి సుక‌న్య నుంచి ప్ర‌గ‌తి, సితార వ‌ర‌కు ప్ర‌స్తుతం ఉన్న లీడింగ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు అని చెప్పాలి. వీరంతా హీరోల త‌ల్లి పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారారు. ఇక సితార విష‌యానికి వ‌స్తే ఒక‌ప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారి దూసుకు పోతున్నాడు. త‌మిళ్‌, తెలుగులో సితార లీడింగ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌. అయితే ఈ న‌టికి ఇంకా పెళ్లి కాలేదు అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. అవును.. సితారకు ఇంకా పెళ్లి కాలేదు. 

 

చాలా మంది సితార ఎంచ‌క్కా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింద‌ని అనుకుంటున్నారు. ఈ వియంపై ఆమె త‌న తాజా ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. తాను ఏడెనిమిదేళ్ల పాటు త‌న పెళ్లి గురించి ఎంత మాత్రం ఆలోచ‌న చేయలేద‌ని చెప్పింది. ఇక ఇప్పుడు త‌న‌కు వ‌య‌స్సు అయిపోయింద‌ని.. పెళ్లి చేసుకోవాల‌న్న ఆలోచ‌నే త‌న‌కు లేద‌ని చెప్పేసింది. అయితే దీనికి ఆమె ఓ రీజ‌న్ కూడా చెప్పారు. సితార‌కు ఆ మె తండ్రి అంటే చాలా ఇష్టం అట‌. ఆమె త‌న వ్య‌క్తిగ‌త జీవితం లేదా కెరీర్‌కు సంబంధించి ఏ నిర్ణ‌యం తీసుకోవాలన్నా ఆయ‌న‌పైనే పూర్తిగా ఆధార‌ప‌డి ఉండేవార‌ట‌.

 

అలాంటి తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో సితార మానసికంగా కోలుకోలేకపోయారట. ఆ బాధను, ఒంటరితనాన్ని మరిచిపోవడం కోసం గ్యాప్ లేకుండా సినిమాలు చేశారట. అలా పెళ్లి చేసుకోవాల్సిన టైంలో కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టి వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన సితార పెళ్లి చేసుకోవాల‌న్న విష‌య‌మే మ‌ర్చిపోయింద‌ట‌. ఏదేమైనా ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్‌.. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించిన సితార చివ‌ర‌కు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవ‌డం వెన‌క ఇంత బాధాక‌ర‌మైన విష‌యం ఉంద‌న్న మాట‌.
 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: