మెగాస్టార్ చిరంజీవిశ్రీదేవి జంటగా తెరకెక్కిన జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజై రేపటితో 30 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ విడుదల చేస్తోన్న సినిమా విశేషాల రెండో భాగాన్ని రిలీజ్ చేశారు. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిన పాటల గురించి కొన్ని విషయాలు తెలిపారు. సినిమాపై చిరంజీవికి ఉన్న డెడికేషన్ లెవల్స్ కు ఉదాహరణగా ఓ విషయాన్ని వివరించారు. ‘ధినక్కుతా.. చమక్కురో’ పాట చేసి శ్రీదేవి బొంబాయి వెళ్లిపోవాలి. అదే సమయంలో చిరంజీవికి 104 డిగ్రీల జ్వరం ఉందట.

 

 

 

మే9 సినిమా రిలీజ్ కావాలంటే ఈ పాట షూట్ అయిపోవాలి. ఇంత టెన్షన్ వాతావరణంలో చిరంజీవి అంత జ్వరాన్ని కూడా లెక్క చేయక పాట ఫినిష్ చేశారట. అశ్వనీదత్ ఇప్పటికీ ఆ విషయం గర్వంగా చెప్తారట. ఈ పాటలో చిరంజీవి ముఖంలో ఎటువంటి అలసట కనిపించకపోవడం విశేషం. సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా అందించిన ట్యూన్స్ లో అన్నీ మెలోడీస్ ఉన్నాయని చిరంజీవి అనుమానం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ కు మాస్ సాంగ్ ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయం. ఇళయరాజా ఇచ్చిన ట్యూన్ ను మార్చటం అశ్వనీదత్ కు ఇష్టం లేకపోయింది. ఇళయరాజాకు రీట్యూన్ చేయడం ఇష్టం ఉండదు.

 

 

 

విషయం తెలుసుకున్న వేటూరి ఈపాటకు మాస్ టచ్ ఇస్తానని చెప్పారట. అదే.. ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాట. కేవలం రెండు రోజుల్లో చిత్రీకరించిన ఈపాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అప్పట్లో ఈ పాటకు తెర మీద డబ్బులు పడ్డాయంటే ఏస్థాయిలో హిట్టయిందో అర్దం చేసుకోవచ్చు. అదే రాఘవేంద్రరావు ‘అందాలలో..’ పాటను 11 రోజుల్లో చిత్రీకరించారట. ఈ పాటను చూస్తే నిజంగా మానస సరోవరంలో ఉన్నట్టే ఉంటుంది. చలం ఆర్ట్ ఆస్థాయిలో ఉంది.. అంటూ నాని వాయిస్ ఓవర్ లో విశేషాలు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: