టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోలుగా నటించిన వారు ఇప్పుడు విలన్లు గా యూటర్న్ తీసుకుంటున్నారు. గతంలో విలన్ గా నటించి హీరోలుగా నటించిన వారు ఇప్పుడు మళ్లీ విలన్లుగా నటించేందుకు సిద్దమవుతున్నారు. కెరీర్ బిగినింగ్ లో నటుడు శ్రీకాంత్ విలన్ గా నటించాడు.  ఆ తర్వాత టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు సంపాదించాడు.   ఎవరూ ఊహించని విధంగా హీరోగా అతి తక్కువ కాలంలో 100 సినిమాలను పూర్తి చేశాడు. తన సహనటి ఊహను వివాహం చేసుకున్నాడు.  కొంత కాలంగా మల్టీస్టారర్ మూవీస్ లో కూడా నటిస్తున్నాడు.

 

 శ్రీకాంత్ ఇప్పుడు సోలో హీరోగా కన్నా సైడ్ క్యారెక్టర్స్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు.  అప్పుడప్పుడు సోలో హీరోగా కూడా మెప్పిస్తున్నాడు.  తాజాగా జగపతిబాబులో విలన్ ను తెరకి పరిచయం చేసిన బోయపాటి, శ్రీకాంత్ లోని విలన్ ను కొత్తకోణంలో పరిచయం చేస్తున్నాడు. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూవీలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నెరసిన గెడ్డం,  మీసాలతో, డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో చాలా స్టైలీష్ గా ఈ సినిమాలో శ్రీకాంత్ కనిపించనున్నాడని అంటున్నారు. బోయపాటి చాలా కొత్తగా శ్రీకాంత్ పాత్రను డిజైన్ చేశాడనీ, ఈ పాత్ర మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు.

 

గతంలో ఎవరూ ఊహించని విధంగా ఫ్యామిలీ హీరో జగపతిబాబు ని ‘లెజెండ్’ మూవీలో భయంకరమైన విలన్ గా చూపించాడు.  ఈ మూవీలో కూడా జగపతిబాబు లుక్ ని కంప్లీట్ గా మార్చిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి జగపతి బాబు అదృష్టం పూర్తిగా మారిపోయింది. హీరోగా కన్నా విలన్ గా ఇప్పుడు మంచి సక్సెస్ లో ఉన్నాడు. ఇప్పుడు విలన్ పాత్రలతో శ్రీకాంత్ బిజీ అవుతాడని అంటున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నాయికగా కొత్త కథానాయిక పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: