కేంద్రం లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ లు ఆగిపోవటంతో సెలబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి సమయంలో చాలామంది సోషల్ మీడియాలో అందుబాటులోకి వస్తూ అనేక విషయాల గురించి తన అభిమానులతో ముచ్చట ఇస్తున్నారు. మరి కొంతమంది అయితే రకరకాల వీడియోలు మరియు పనులు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నన్ను పెళ్లి చేసుకోవడానికి  'క్యూ' కట్టారు అని లైవ్ వీడియో లో టాప్ సీక్రెట్ చెప్పటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ హీరోయిన్ పేరు మరెవరో కాదు ర‌వీనా టండ‌న్.16 సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పలు భాషల్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.

 

2004వ సంవత్సరంలో సినిమా డిస్ట్రిబ్యూట‌ర్‌ అనిల్ థ‌డానీని ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చాలా వరకూ తక్కువ సినిమాల్లో నటించడం జరిగింది. ఆమెకు పిల్లలు అంటే బాగా ఇష్టం ప్రాణం కావడంతో ఆమెకు పిల్లలు లేకపోవడంతో దత్తత తీసుకుని వాళ్ళ ఆలనా పాలనలో ఆమె మునిగిపోయారు. దీంతో ఆమె సినిమాలపై సరైన దృష్టి పెట్టలేదు. అయితే ఇటీవల ర‌వీనా టండ‌న్ మళ్లీ సినిమాల్లోకి రావాలని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా గ్యాప్ వచ్చినా కానీ ఆమెకు ఏమాత్రం అభిమానులు తగ్గలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో గతంలో వేసవిలో హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 

దీంతో ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఆమె అందానికి ఫిదా అయ్యారు. మరోపక్క నెటిజ‌న్ల నుంచి విప‌రీత‌మైన కామెంట్స్ వ‌స్తున్నాయి. చాలామంది ఆమె అందాన్ని బాగా పొగడటం జరిగింది. ఈ సంద‌ర్భంగా ఒక అభిమాని ధైర్యం చేసి ఆమెను ఓ ప్ర‌శ్న అడిగాడు.  "ర‌వీనా మేడ‌మ్‌.. వ‌చ్చే జ‌న్మ‌లో న‌న్ను పెళ్లి చేసుకుంటారా?" అని మ‌న‌సులో మాట‌ను దాచుకోకుండా ఆమె ముందు పెట్టాడు. దీనికి ర‌వీనా అంతే స్పోర్టీవ్‌గా తీసుకుని  స్పందిస్తూ.. "మ‌న్నించాలి, ఇప్ప‌టికే ఏడుగురికి బుక్ అయిపోయింది" అంటూ స‌మాధానం ఇచ్చారు. చాలా సరదాగా ర‌వీనా టండ‌న్ మాట్లాడటంతో అభిమానులు కూడా చాలా స్పోర్టివ్ గా ప్రశ్నలు వేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: