దాదాపు 25 ఏళ్ల కెరీర్ లో  వందల సినిమాల చేసిన సీనియర్ హీరోలకు ఇప్పుడు ఏ స్టోరీ చెప్పినా పెద్దగా నచ్చడం లేదు. అందుకే ఎలాంటి సినిమాలు చెయ్యాలా అని ఊగిసలాటలో ఉన్నారు చిరంజీవి తో పాటు మిగతా హీరోలు . చిరంజీవి 150 సినిమాల ల్యాండ్ మార్క్ ని ఎప్పుడో దాటేశారు. ఇన్నాళ్ల కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీల్ని టచ్ చేశారు మెగాస్టార్. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక స్టోరీ సెలక్షన్లో మాత్రం టైమ్ తీసుకుంటున్నారు చిరంజీవి. ఎందుకంటే .. ఆల్రెడీ చేసి లైన్‌ కాకుండా సరికొత్తగా ఆడియన్స్ ముందుకు రావాలనుకుంటున్న చిరంజీవికి  కథలు పెద్దగా నచ్చడం లేదు. అందుకేకథలు విన్న తర్వాత నచ్చితే మాత్రమే ఓకే చేస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు మెగాస్టార్.

 

మరో సిక్స్ టీ ప్లస్ హీరో నాగార్జునక కూడా ఈ మద్య వస్తున్న కథలు పెద్దగా నచ్చడం లేదట. కెరీర్ లో ప్రయోగాలు చెయ్యడానికి ఎప్పుడూ ముందుండే ఈ మన్మధుడు .. సమ్ ధింగ్ డిఫరెంట్ గా ఉంటేనే సినిమాకు ఓకే చెబుతున్నాడు. కథ నచ్చితే చాలు . యంగ్, అప్ కమింగ్ డైరెక్టర్లు అన్న తేడా లేకుండా సనిమా చేసేస్తున్నాడు నాగార్జున. కానీ ..ఈ మద్య దాదాపు 50 కథలు విన్నా కూడా ఒక్కటి కూడా  ఎగ్జైటింగ్ గా అనిపించక  ఏ సినిమాకీ సైన్ చెయ్యలేదట నాగార్జున.

 

వెంకటేష్  కూడా ఇదే రూట్ ని ఫాలో అవుతున్నాడు. అటు స్టోరీ డ్రివెన్ సినిమాలు చేస్తూ.. మరో పక్క మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ.. కెరీర్ కంటిన్యూ చేస్తున్న వెంకీ కూడా స్టోరీ సెలక్షన్ లో టైమ్ తీసుకుంటున్నాడు. ఈ మధ్య రమేష్ అనే యంగ్ డైరెక్టర్ స్టోరీ చెప్తే.. అది అంతగా నచ్చలేదని .. సినిమా చెయ్యలేనని చెప్పాడట వెంకీ. 


బాలకృష్ణ కూడా ఈ మద్య రియలైజ్ అయ్యాడు . రొటీన్  కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ గా సినిమాలు చేద్దామని ఫిక్స్ అయ్యాడు.  అందుకే బోయపాటి బాలయ్య కోసం స్క్రిప్ట్ రెడీ చేసి సంవత్సరం అయినా .. ఆ కథ పెద్దగా నచ్చక చాలా సార్లు కరెక్షన్ చేయించాడు బాలయ్య.  సో..ఇలా సీనియర్ హీరోలు తమ ఇమేజ్ తో పాటు .. ఆడియన్స్ పల్స్ ని కూడా క్యాచ్ చేసి ఎవరితో సినిమాలు చెయ్యాలి .. ఏ సబ్జెక్ట్ అయితే సూట్ అవుతుంది  అంటూ బాగా ఆలోచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: