అప్పుడప్పుడు సినిమాలు చేసినా హీరోలకు మాత్రం అదిరిపోయే హిట్లు ఇచ్చాడు  డైరెక్టర్ హరీష్ శంకర్ . అంతేకాదు తన సినిమాల్లో స్టార్లను డిఫరెంట్ గా చూపించాడు . అందుకే మెగాస్టార్ , పవర్ స్టార్, సూపర్ స్టార్లతో సినిమాలు చేసే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు హరీష్ శంకర్.చిన్న హీరోలే కాకుండా.. పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేసి తనవర్త్ ప్రూవ్ చేసుకున్నాడు ఈ మాస్ డైరెక్టర్. పక్కా కమర్‌షియల్ ఎంటర్ టైనర్స్ చేసి హిట్ ఇవ్వగలిగే సత్తా ఉన్న హరీష్ ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా కి రెడీ అవుతున్నాడు. మెగాస్టార్ తో సినిమా చెయ్యడం..తన లైఫ్ యాంబిషన్  అని చెబుతున్న హరీష్..ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాడు.
 
చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ద మెమరబుల్ హిట్ రౌడీ అల్లుడు.  ఈ సినిమా ఇన్స్ పిరేషన్ తో కథ రెడీ చేసుకున్న హరీష్.. ఈ స్టోరీ మెగాస్టార్ కి చెప్పగానే మారు మాట్లాడకుండా ఓకే చెప్పేశారట. ఈ సినిమా ఫ్యాన్స్ ని ఫుల్ టెప్ట్ చేసే లా తయారు చేస్తానని, చిరంజీవిని ఫుల్ మాస్  ఎంటర్ టైనర్ గా ఈ సినిమాలో చూస్తారని , ఫ్యాన్స్ థియేటర్ కి మళ్లీ మళ్లీ వచ్చేలా ఉంటుందని , ఇంట్రస్టింగ్ న్యూస్ చెబుతున్నాడు హరీష్.

 

చిరంజీవి తో సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని చెబుతున్నాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ప్పుడు డైరెక్టర్  లా కాకుండా ఓ అభిమానిగా సినిమా చేస్తానంటున్నాడు. పవర్ స్టార్ తో చేసే సినిమా.. అభిమానులకు  విజువల్ ఫీస్ట్  అని, అభిమానులు ఏం కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని,  పవన్ కళ్యాణ్ కి ఇది స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోయే సినిమాగా రెడీ చేస్తున్నట్టు కాన్‌ఫిడెంట్ గా చెప్పాడు ఈ గబ్బర్ సింగ్ డైరెక్టర్‌.

 

మెగాస్టార్, పవర్ స్టార్ తోపాటు సూపర్ స్టార్ కి కూడా స్టోరీ రెడీ చేస్తున్నాడు.  మహేష్  కోసం మంచి స్టోరీ రెడీ చేస్తున్నట్టు చెబుతున్నాడు హరీష్ శంకర్. మహేష్ తో కూడా ఓ  ఇంట్రస్టింగ్ సినిమా చెయ్యాలనుందని, అందుకే ఆయన ఇమేజ్ కి తగినట్టు కథ రెడీ చేస్తున్నట్టు చెప్పాడు హరీష్ శంకర్.  ఇలా స్టార్  హీరోలకు వరుసగా సినిమాలు చేసే బంపర్ ఆఫర కొట్టేశాడు హరీష్.

మరింత సమాచారం తెలుసుకోండి: