ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా వెలుగు వెలిగిన వారు ప్రస్తుతం విలన్ పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నారు. చాలామంది అటువంటి హీరోలు విలన్ పాత్రలు ప్రస్తుతం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. పరిస్థితులు పూర్తిగా మారడంతో టెక్నాలజీ రావటంతో ఏదో విధంగా ఇండస్ట్రీలో రాణించాలని ఉన్న క్రేజ్ ఉపయోగించుకొని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇండస్ట్రీలో చిరంజీవి తమ్ముడిగా పిలిపించుకునే బయట హీరోలలో ప్రముఖుడు శ్రీకాంత్ తాజాగా విలన్ పాత్రలు చేయటానికి రెడీ అయ్యారు. మొన్నటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన శ్రీకాంత్ తాజాగా నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

మామూలుగా అయితే శ్రీకాంత్ ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే కెరియర్ మిడిల్ లో హీరోగా టర్న్ అయ్యి సక్సెస్ కావడంతో దాదాపు 100కు పైగా చిత్రాల్లో హీరోగా శ్రీకాంత్ నటించడం జరిగింది. ఇటువంటి సందర్భంలో కెరియర్ పరంగా చాలా లో లో గ్రాఫ్ ఉన్న తరుణంలో బాలకృష్ణ ని నమ్ముకున్నాడు శ్రీకాంత్. ఇప్పటివరకు సరైన అవకాశాలు పెద్దగా రాకపోవడంతో బోయపాటి చొరవతో బాలకృష్ణ సినిమాలో విలన్ రోల్ శ్రీకాంత్ చేయబోతున్నట్లు సమాచారం.

 

 

గతంలో బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' సినిమా లో… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించడంతో ఆ చనువుతో బాలకృష్ణ సినిమాలో శ్రీకాంత్ ఛాన్స్ కొట్టేశాడు. తాజాగా శ్రీకాంత్ విలన్ లుక్ కి సంబంధించి పోస్టర్ రిలీజ్ అవ్వడం జరిగింది. సూటు బూటు వేసుకుని తలకట్టు మార్చి గుబురు గడ్డం పెంచి పండు వెంట్రుకలతో కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: