సినిమాల్లో హీరో హీరోయిన్లతో పాటు ఇతర పాత్రల్లో నటించే నటీనటుల పాత్రలు కూడా ఎంతో ముఖ్యం. ఆయా పాత్రల ఔచిత్యాన్ని బట్టి క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించాల్సి ఉంటుంది. అలాంటి పాత్రల్లో నటించి మెప్పిస్తున్న నటి సితార. తెలుగు, కెరీర్ తొలినాళ్లలో తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసి ప్రస్తుతం క్యారెక్టర్ నటిగా సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. కేరళకు చెందిన సితార తన తొలి సినిమాను 1986లో మళయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ హీరోలుగా నటించిన కావేరి సినిమా ద్వారా పరిచయం అయింది.

IHG

 

తర్వాత తమిళ్, తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ.. సితార క్యారెక్టర్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. కెరీర్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న సితార జీవితంలో ఒంటరిగానే మిగిలిపోయింది. ఇదే విషయమై ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నా కాలేదు. దానికి కారణమంటూ లేదు. నాన్న చనిపోయిన తర్వాత చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. రెండు మూడేళ్లు సినిమాలు చేయలేదు. తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యాను. కానీ.. పెళ్లంటే బాగుంటుందని తెలుసు’ అని చెప్పుకొచ్చింది.

IHG

 

కెరీర్లో తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఉన్న సితార తమిళ స్నేహంకోసం సినిమాలో క్యారెక్టర్ నటిగా నటించింది. ఆ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ కావడంతో దాదాపు 20ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. ఇప్పటికీ తెలుగులో మంచి పాత్ర ఉంటే మేకర్స్ అంతా సితారనే ఎంపిక చేసుకుంటారు. కెరీర్లో ఇప్పటి వరకూ దాదాపు 135 సినిమాల్లో నటించంది. తెలుగులో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన మనసు మమతలో నరేశ్ సరసన నటించింది. ఆ సినిమా హిట్ కావటంతో వరుసగా సినిమాలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: