తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలికి ఉన్న క్రేజ్ సంగతి తెలిసిందే. అందులో మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎన లేని అభిమానం. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాజకీయ ప్రవేశం తో ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాలు పవన్ కు ఏ విధమైన ఫలితాలను ఇస్తాయో చూడాలి.

 

దాదాపు రెండేళ్ల తర్వాత సినిమాల పై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ వెండి తెర ఎంట్రీ కి వరుసగా మూడు సినిమాలకు ఒకే చెప్పారు. వాటిల్లో ఒకటి ఈ పాటికే ప్రేక్షకుల ముందుకి రావాలని అనుకున్నారు. కాని లాక్ డౌన్ నేపధ్యంలో అన్ని సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీని తో పవన్ సినిమా కూడా వాయిదా పడింది. అన్ని సక్రమంగా ఉంటే  వేణు శ్రీ రాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా  ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. 

 

మిగిలిన కొద్దిపాటి షూటింగ్ కూడా పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు అనుకున్నారు. ఈ మూవీ లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా పై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: