తెలుగు సినీ పరిశ్రమలో చాలా మందికి ఆయన ఒక రోల్ మోడల్. ఆయన కేరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆయన నృత్యంతోనే ఒక ప్రభంజనం సృష్టించి అశేష ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఆయనే మెగా స్టార్ చిరంజీవి. తెలుగు పరిశ్రమలో ఎన్టిఆర్ తర్వాత అంతగా ప్రేక్షకాదరణ పొందిన వ్యక్తి, అభిమానించదగ్గ కథానాయకుడు చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమలో అంచలంచెలుగా ఎదిగిన నటుడు. యాక్షన్, డ్యాన్స్ లతో అత్యంత ప్రాముఖ్యత సంపాదించాడు. తెలుగు పరిశ్రమలో మొదటి సారి బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనత చిరంజీవికి దక్కింది. 

 

అయితే ఆయన కెరీర్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఆల్ టైం రికార్డులను తిరగరాసింది. ఆయన నటించిన క్లాసికల్ సినిమాలన్నిటిలో టాప్ వన్ ప్లేస్ లో ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా రేపటికి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. అయినా ఇప్పటికి ఈ సినిమా ఎవర్ గ్రీన్ సినిమాగా ఇండస్ట్రీలో నిలిచింది. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు దర్శక దిగ్గజం కే. రాఘవేంద్రరావు గారు దర్సకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అప్పట్లో వైజయంతి మూవీస్ ఆస్థాన కథానాయిక గా పేరు పొందిన దివంగత శ్రీ దేవి దేవ కన్య పాత్రలో మెప్పించారు. 

 

సినిమా కథ, యాక్షన్ పరంగానే కాక సంగీతం కూడా ప్రేక్షకుల మన్ననలు పొందాయి. అంత అద్భుతమైన సంగీతానికి  ఇళయరాజా గారు దర్శకత్వం వహించారు. ఇప్పటికి ఈ సినిమా విడుదలైయ్యి ముప్పై సంవత్సరాలు అవుతున్నా ఈ సినిమాలో పాటలు ఇప్పటికి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఈ సినిమాలో ఒక పాట షూటింగ్ సమయంలో చిరంజీవి గారికి విపరీతమైన జ్వరం. అప్పటికే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో  ఒక్క రోజు తేడా వచ్చినా మొత్తం అంతా మారిపోతుందని అలాగే డ్యాన్స్ చేసారు చిరంజీవి. అశ్విని దత్తు గారు ఎప్పటికైనా ఈ సినిమా సీక్వెల్ ని తీయాలని అనుకుంటున్నట్టు సిని వర్గాల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: