టాలీవుడ్ లో పుష్ప సినిమా ఒక హాట్ టాపిక్. పుష్ప సినిమా విషయంలో అల్లు అర్జున్ చూపిస్తున్న శ్రద్ధ తో పాటు సుకుమార్ పడుతున్న కష్టం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రయోగాల విషయంలో ముందుకు అడుగు వేసే సుకుమార్సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు అనే వార్తలు వస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరో ప్రయోగానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని సమాచారం. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అల్లు అర్జున్ కి సుకుమార్ కొన్ని షరతులు పెట్టాడు అని టాలీవుడ్ జనం అంటున్నారు. అది ఏంటీ అంటే ఈ సినిమా చేసే వరకు మరో సినిమాను చేయకూడదు అని షరతు పెట్టాడట. ఇంకో సినిమా కథ కూడా వినే ప్రయత్నం చేయవద్దు అని దయచేసి ఈ సినిమా మీద మాత్రమే దృష్టి పెడితే మంచిది అని సూచనలు చేసినట్టు సమాచారం. ఇప్పుడు పుష్ప సినిమా కోసం సుకుమార్ మరో ప్రాజెక్ట్ గురించి చర్చలు కూడా జరపడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఇటు అల్లు అర్జున్ ని కూడా ఇప్పుడు తాను చెప్పినట్టు వినాలి అని అలాగే బాలీవుడ్ లో తీసే అల వైకుంఠపురములో సినిమా మీద కూడా అంతగా ఇప్పుడు ఫోకస్ చేయవద్దు అని చెప్పాడట. దీనితో ఇక చేసేది ఏమీ లేక ఇతర ప్రాజెక్ట్ ల కథలను కూడా వినడం లేదని, అల్లు అరవింద్ విని నచ్చితే ఓకే చెప్తున్నారు లేకపోతే లేదు అని అంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న సినిమాలో అతను ఎర్ర చందనం స్మగ్లర్ గా నటించే సూచనలు ఉన్నాయి. ఈ సినిమా  వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: