టాలీవుడ్ లో కొంత మంది ని స్క్రీన్ మీద చూడాలి అని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో హీరోలు అందరూ కూడా తమ భార్యలతో తెర మీద కనపడాలి అనేది చాలా మంది కోరిక. సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని వార్తలు కూడా హీరోల మీద వస్తున్నాయి. చిన్న చిన్న హీరోల సినిమాల్లో కూడా భార్యలను ఒక సీన్ లో అయినా చూపించాలి అనేది నిర్మాతలు దర్శకుల ఆలోచన. హీరోలు కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. అది సినిమా మార్కెట్ కి బాగా కలిసి వస్తుంది అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఇప్పుడు మన తెలుగులో చాలా మంది హీరోలు భార్యలను సినిమాల్లో చూపించే ప్రయత్నాలు కనపడుతున్నాయి. మహేష్ బాబు తన భార్య నమ్రతను సినిమాలో చూపించే అవకాశం ఉందని తెలుస్తుంది. పరుశురాం దర్శకత్వంలో వచ్చే సినిమాలో ఆమెకు ఒక మంచి పాత్ర ఇచ్చే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నాడు అని సమాచారం. దర్శకుడికి ఇదే విషయాన్ని మహేష్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి అది జరుగుతుందా లేదా అనేది చూడాలి. నమ్రత కూడా తన భర్త సినిమాలో కనపడటానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ప్రస్తుతం ఆమె మహేష్ సినిమాల బాధ్యతలను ఎక్కువగా చూస్తున్నారు. మహేష్ సినిమాలో పారితోషికం సహా అనేక విషయాలను ఆమె స్వయంగా జాగ్రత్తగా చూస్తున్నారు. ఆమె మహేష్ సినిమాలో నటిస్తే చూడాలి అని చాలా మందికి ఆశగా కూడా ఉంది. ఆమె మాత్రం ఎప్పటి నుంచో అవకాశం ఉన్నా సరే నటించడానికి ముందుకు రావడం లేదు అని ప్రచారం జరుగుతుంది. ఆమె ఎందుకు చేయడం లేదు అనేది ఎవరికి స్పష్టత లేదు. ఆమెను నటించాలి అని మహేష్ కోరినా సరే ముందుకు రావడం లేదు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: