మాటల మాంత్రికుడుగా  త్రివిక్రం శ్రీనివాస్ కి పేరు. ఆయన తన సినిమాలను మాటలతోనే రఫ్  ఆడించేస్తారు. ఆయన చెప్పే మాటలు అన్నీ కూడా అందరికీ తెలిసినవే అయినాసినిమాల్లో ఆయా క్యారక్టర్ల  ద్వారా చెప్పిస్తున్నపుడు అంతా లీనమైపోతారు. శ్రధ్ధగా వింటారు. అది కొత్తగా మళ్ళీ విన్నట్లుగా ఫీల్ అవుతారు.

 

ఇదిలా ఉండగా త్రివిక్రం కొన్ని కాంబినేషన్లతో మూవీస్ చేస్తూ హిట్ పెయిర్ అనిపించుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేది బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు ఇచ్చాడు. ఇక అల్లు అర్జున విషయానికి వస్తే వరసగా మూడు సూపర్ హిట్లు ఇచ్చారు. జులాయితో మొదలైన వీరి కాంబో ఆ తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తి తో సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక అల వైకుంఠపురంలో మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి టాప్ రేంజికి చేరింది.

 

అదే విధంగా ఎన్టీయార్ తో అరవింద సమేతతో హిట్ ఇచ్చిన త్రివిక్రం  ఇపుడు మరో సినిమాకు రెడీ అయిపోతున్నాడు.ఇలా తన హీరోలను తానే కంటిన్యూ చేస్తూ హిట్ ఫార్ములాను కనుగొంటూ దూసుకుపోతున్న త్రివిక్రం  మ్యూజిక్  డైరెక్టర్ల విషయంలోనూ అలాగే చేస్తున్నాడు. ఆయన మొదట దేవీశ్రీ ప్రసాద్ నే ఎంచుకుని అనేక మ్యూజికల్ హిట్లు ఇచ్చాడు.

 

మరి ఈ ఇద్దరి మధ్యన ఏ విభేధాలు వచ్చాయో తెలియదు కానీ కొత్తగా  తమన్ ఎంట్రీ ఇచ్చాడు. తమన్ అరవింద సమేతతో ఎంన్టీయార్ కి మంచి హిట్ ఆల్బం ఇచ్చాడు. ఇక బన్నీతో కూడా తమన్ అల వైకుంఠపురంలో మూవీ ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ మ్యూజిక్ నే ఇచ్చాడు. ఇపుడు మరోసారి ఎంన్టీయార్ త్రివిక్రం మూవీకి తమన్ సంగీతం అందించే పనిలో ఉన్నాడు. మొత్తం మీద చూసుకుంటే తమన్ త్రివిక్రం జోడీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరెన్ని  హిట్లు ఈ కాంబోలో వస్తాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: