మన తెలుగు సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు బాలీవుడ్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సినిమాలకు మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అక్కడి సినిమాల్లో ఉన్న నటులు ఇక్కడి సినిమాల్లో కనపడితే కలిసి వస్తుంది అని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఇప్పుడు మన స్టార్ హీరోలు కొందరు అక్కడి హీరోయిన్ లను మన తెలుగు సినిమాల్లో తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు దీపిక పదుకొనే ప్రియాంక చోప్రా ను తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది. 

 

మహేష్ బాబు దీపిక పదుకొనే కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రభాస్ కూడా బాలీవుడ్ హీరోయిన్ ల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. చిన్న చిన్న పాత్రలు అయినా తన సినిమాలో చెయ్యాలి అని బాలీవుడ్ హీరోయిన్ లను అడుగుతున్నారు మన స్టార్ హీరోలు. మరి వాళ్ళు చేస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బాలీవుడ్ హీరోయిన్ ని సినిమాలో తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. 

 

క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. మరి అది జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఇక మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ లను తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ లతో పాటు అక్కడ పాపులర్ అయిన నటులను కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారు అనేది సమాచారం. మరి చేస్తారా లేదా అనేది తెలియదు. భారీగా పారితోషికం కూడా మన వాళ్ళు వారికి ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమాలో మన స్టార్ హీరో ఒకరు కనపడే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: