ఏ ముహూర్తాన సాహో అనే టైటిల్ పెట్టారో గానీ.. సాహసాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయాడు ప్రభాస్ . ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీకి సైన్ చేశాడు. 20కోట్లు కలెక్ట్ చేయని దర్శకులకు ఛాన్స్ లు ఇచ్చేస్తున్నాడు. ప్రేమ కథకు 200కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు. 

 

ప్రభాస్ సాహసాల పర్వం బాహుబలితో మొదలైంది. రాజమౌళి ఆశీస్సులతో బాహుబలి పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. బాహుబలి 2 దగ్గరికొచ్చేసరికి బడ్జెట్ పెరిగిపోయి.. హయ్యెస్ట్ బడ్జెట్ తో రిలీజైంది. అప్పటి వరకు మగధీరకు ఎక్కువ ఖర్చుపెట్టిన తెలుగు సినిమా బాహుబలి.. బాహుబలి 2తో 200కోట్ల బడ్జెట్ దాటేసింది. ఇక బిజినెస్ అయితే.. 300కోట్లు. అమ్మో అనుకున్న 300కోట్లను అలవోకగా రాబట్టేసి.. ప్రపంచ వ్యాప్తంగా 800కోట్లు రాబట్టాడు ఈ సాహసవీరుడు. 

 

రాజమౌళి అండతో బాహుబలి సాహసం సక్సెస్ అయితే.. రెండో సాహసం సాహో మాత్రం బెడిసికొట్టింది. బాహుబలి తీసుకొచ్చిన క్రేజ్ తో సాహోను కూడా పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. సాహో దర్శకుడు సుజిత్ కు ఒక్క సినిమా రన్ రాజా రన్ తీసిన అనుభవం మాత్రమే ఉంది. సినిమా సక్సెస్ అయినా.. 20కోట్ల మార్క్ దాటలేదు. ఇలాంటి దర్శకుడికి.. 200కోట్లకు పైగా ప్రాజెక్ట్ సాహోను అప్పజెప్పి ప్రభాస్ సాహసమే చేశాడని చెప్పాలి. అయితే ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ స్టెప్ సక్సెస్ కాలేదు.

 

బాహుబలి క్రేజ్ తో సాహో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. సాహో తెలుగులో వంద కోట్లు కలెక్ట్ చేసినా.. అంతకుమించి బిజినెస్ జరుగడంతో.. ఫ్లాప్ కిందకు వెళ్లిపోయింది. ఇక హిందీలో 100కోట్ల మార్క్ దాటి.. పెట్టుబడిని రాబట్టడంతో బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయ్యారు. ఓవరాల్ గా చూస్తే.. సాహో కమర్షియల్ గా ఫ్లాప్ కిందే లెక్క. 

 

సాహో నిరాశపరిచినా.. సాహసాలకు అలవాటుపడిన ప్రభాస్ వెనక్కి తగ్గడం లేదు. అంతకంతకు బడ్జెట్ పెంచుకుంటూ వెళ్లిపోతున్నాడు. బాక్సాఫీస్ వద్ద 50కోట్లు దాటని సినిమాల దర్శకులకు ఆఫర్స్ ఇస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: