కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకొచ్చి దాదాపు 13 ఏళ్ళు అవుతోంది. 2007 లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాలతో ఏకంగా స్టార్ హీరోయిన్ పేరు సంపాదించుకుంది. యంగ్ హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు నటించిన సినిమాలన్ని దాదాపు బ్లాక్ బస్టర్స్ హిట్స్ గా నిలిచాయి. అందుకే సౌత్ అండ్ నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ విపరీతమైన క్రేజ్ ఉంది.

 

ఇక మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మరోసారి చిరంజీవి సరసన నటిస్తుంది కాజల్ అగర్వాల్. వాస్తవంగా ఈ సినిమాలో ముందు నయనతార అనుకున్నారు. తర్వాత తమన్నా, త్రిష అనుకున్నారు. కాని వాళ్ళందరిని కాదని ఫైనల్ గా కాజల్ ని తీసుకున్నారు. ముఖ్యంగా త్రిష ని కాదని మళ్ళీ కాజల్ ని తీసుకోవడానికి  కారణం గతంలో చిరంజీవి త్రిష కాంబినేషన్ లో వచ్చిన స్టాలిన్ ఫ్లాప్ కావడమేనట. అయితే కాజల్ నటించిన ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్టయింది. అదీకాక చిరంజీవి పక్కన పేయిర్ గా కాజల్ బావుంటుందన్న ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ ఫైనల్ గా కాజల్ నే ఎంచుకున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.

 

ఇక తమిళంలోను కమల్ హాసన్ కి జంటగా ఇండియన్ 2 లో కాజల్ నటిస్తుంది. కమల్ హాసన్ కాజల్ ది ఫ్రెష్ కాంబినేషన్ కాబట్టి కాజల్ ని ఎంచుకున్నారు శంకర్. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల తో పాటు మరో భారీ ప్రాజెక్ట్ లో కూడా చేయబోతోంది. ఏ.ఆర్ మురగదాస్ విజయ్ కాంబినేషన్ లో తుపాకి 2 తెరకెక్కనుంది.

 

అంతేకాదు ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రూపొందించనున్నారని లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాలో కాజల్ ని ఎంపిక చేసుకున్నారట. ఇదే కాంబినేషన్ లో తుపాకి వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రకంగా చూస్తే వరగా అన్ని పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కాజల్ మామూలుది కాదు బాబోయ్ అనిపించుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: