టాలీవుడ్ నలుగురు సీనియర్ సూపర్ స్టార్స్ లో వెంకటేశ్ కు ప్రత్యేక శైలి ఉంది. కెరీర్ తొలినాళ్ల నుంచీ లవ్ సబ్జెక్టులు ఎక్కువగా చేసి సక్సెస్ అయ్యాడు. తర్వాత ఫ్యామిలీ సబ్జెక్టుల్లో కూడా రాణించి తన హవా చాటాడు. వెంకటేశ్ కెరీర్లో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ చాలా ఉన్నాయి. వాటన్నింటిలోకి ప్రత్యేకమైన సినిమాగా ‘ప్రేమించుకుందాం.. రా’కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమా విడుదలై నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా 1997 మే9న విడుదలైంది.

IHG

 

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా వెంకీ కెరీర్లో బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఫ్యాక్షన్ నేపథ్య కథలకు ఈ సినిమా నాంది పలికింది. ఫస్టాఫ్ లో ప్రేమ, కామెడీ, సెకండాఫ్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి. అంజలా ఝవేరి ఈ సినిమాతోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయిపోయింది. కాలేజీ కుర్రాడిగా, ప్రేమికుడిగా వెంకీ రాణించాడు. ఫ్యాక్షనిస్టులుగా జయప్రకాశ్ రెడ్డి, శ్రీహరి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా జయప్రకాశ్ రెడ్డికి ఈ సినిమా టర్నింగ్ పాయింటి అయింది.

IHG

 

సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ పరంగా చివరన ‘రా’ అని పెట్టి ట్రెండ్ సెట్ చేసింది. ‘ప్రేమ ప్రేమకు లొంగుతుంది కానీ.. పెద్దరికానికి కాదు’ అంటూ పరుచూరి రాసిన డైలాగ్స్ పేలిపోయాయి. మహేశ్ సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్టే. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ ఇచ్చాడు. తొలి సినిమానే అయినా జయంత్ తన టేకింగ్ తో సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టాడు. ఈ సినిమా 53 సెంటర్లలో 100 రోజులు రన్ అయి.. హైదరాబాద్ లో 175 రోజులు ఆడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: