టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా అల్లరి సినిమా దర్శకుడు రవిబాబు అప్పట్లో తెరకెక్కించిన నువ్విలా సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించాడు యువ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకున్న విజయ్, ఎవడే సుబ్రహ్మణ్యం లోని క్యారెక్టర్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించాడు. ఆపై కొన్నాళ్ల తర్వాత ఆయన చిరకాల మిత్రుడైన తరుణ్ భాస్కర్, విజయ్ ని హీరోగా పెట్టి పెళ్లిచూపులు సినిమాలు తీయడం జరిగింది. రీతు వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో మంచి క్లాస్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి అనే బోల్డ్ సినిమాలో నటించాడు విజయ్. 

IHG

కాగా ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో పాటు విజయ్ కు యువతలో అమితమైన క్రేజ్ ను తీసుకొచ్చింది. దాని అనంతరం కొంత గ్యాప్ తర్వాత పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ నటించిన గీత గోవిందం సినిమా కూడా అద్భుత విజయాన్ని అందుకొని, ఆయనకు హీరోగా స్టార్ స్టేటస్ ని తెచ్చి పెట్టింది. ఇక ఆ తర్వాత నుండి వరుసగా అవకాశాలతో టాలీవుడ్ లో ముందుకు తీసుకెళుతున్న విజయ్ దేవరకొండ, ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పలు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఫైటర్ లో హీరోగా నటిస్తున్నాడు. ఎంతో భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తొలిసారిగా మంచి మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు సమాచారం. 

IHG

ఇక మొదటి నుంచి యువతలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్న విజయ్, నేడు తన 31 జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఇప్పటికే కొద్దిరోజులుగా కరోనా ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి తనవంతుగా ఒక ఫౌండేషన్ ని స్థాపించి, అటువంటి వారికి మంచి మనసుతో సహాయ పడుతున్న విజయ్, రాబోయే రోజుల్లో ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, అలానే కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని కోరుతూ పలువురు ప్రేక్షకులు, అభిమానులు విజయ్ కు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు...!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: