రవి తేజ... మాస్ మహారాజ్ రవి తేజ.. రవి శంకర్ రాజు భూపతిరాజు.. మూడు పేర్లు ఒకరివే.. కానీ అభిమానులు అందరూ కలిసి పిలిచే పేరే హీరో రవి తేజ.. ఈయన ఒక సినిమా చూస్తే చాలు ఆరోజు అంత మనం నవ్వుతు... అందులో ఈయన గారు చెప్పిన డైలాగులు చెప్తూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తాం. అలా ఉంటాయి రవితేజ డైలాగులు. ఇంకా అలాంటి హీరో గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

 

1. రవితేజ విజయవాడలో ఉండే సిద్దార్థ్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు.  

 

2. ఇంకా సినీ కెరీర్ ప్రారంభంలో చెన్నైలో ఇప్పుడు ఫేమస్ దర్శకులు అయినా వైవిఎస్ చౌదరి, గుణ శేఖర్ వంటి వాళ్ళతో కలిసి ఒకే రూమ్ లో ఉన్నాడు.. 

 

3. తెలుగు సినిమాల్లో.. అలాగే బాలీవుడ్  సీరియల్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.. 

 

4. కర్తవ్యం అనే సినిమాలో రవి తేజ చిన్న పాత్రలో నటించాడు అదే అతని కెరీర్ లో ఫస్ట్ పాత్ర. 

 

5. క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశి రవి తేజకి జీవితాన్ని ఇచ్చాడు అనే చెప్పాలి.. ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆతర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. 

 

6. నాగార్జున క్రిమినల్ సినిమాకి రవి తేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. 

 

7. ఇంకా రవి తేజలోని యాక్టింగ్ పవర్ గమనించిన కృష్ణ వంశి తన సింధూరం అనే సినిమాలో ఓ పాత్ర ఇచ్చాడు.. నిరూపించుకున్నాడు రవి తేజ. 

 

8. ఇంకా 1989 లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన నీ కోసం సినిమాలో నటించినందుకు రవి తేజకు నంది అవార్డు వచ్చింది. 

 

9. రవి తేజని స్టార్ హీరో చేసింది పూరి జగన్నాథ్ ఏ.. ఇద్దరు కలిసి ఏకంగా 5 సినిమాలు తీశారు. 

 

10. రవి తేజ.. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చైతన్య అనే సినిమాలో చిన్న పాత్రలో మెరిశాడు.. 

 

ఇవేనండి.. మన మాస్ మహా రాజ్ రవి తేజ గురించి ఎవరికి తెలియని నిజాలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: