రామ్ చరణ్.. చిరంజీవి గారి అబ్బాయి అని ఓ 13 ఏళ్ళ క్రితం అనేవారు.. కానీ ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని అంటున్నారు.. 13 ఏళ్ళ తర్వాత చిరంజీవి గారి అబ్బాయి అని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఎదిగాడు.. తండ్రిలో మెగా.. బాబాయ్ లో పవర్ తీసుకొని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయిపోయాడు. 

 

ఈ 13 ఏళ్లలో రామ్ చరణ్ 11 సినిమాలు చేశాడు.. అయితే సెకండ్ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.. అప్పటి వరుకు ఉన్న రికార్డ్స్ ని తుది చేసాడు రామ్ చరణ్ . సినిమాలతో నే కాకుండా ఎన్నో మంచి పనులు చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు రామ్ చరణ్. ఈ పదేళ్లలో ఒక బాధ్యత గల హీరోగా ఎదిగాడు రామ్ చరణ్.. అసలు ఎం చేశాడో చూద్దాం. 

 

చిరుత.. ఫస్ట్ సినిమాలోనే డ్యాన్స్ అదరగొట్టి తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. 

 

మగధీర.. అసలు రామ్ చరణ్ సెకండ్ ఫిలిం అంటే ఎవరు నమ్మరు. అంతలా ఆకట్టుకున్నాడు.  

 

చరణ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమా ఆరంజ్.. సినిమా అయితే ప్లాప్ అయ్యింది కానీ ఈ సినిమాలో మంచి ఫీల్ ఉంది. 

 

తర్వాత వచ్చిన రచ్చ, నాయక్, ఎవడు సినిమాలు కమర్సియల్ హిట్స్ గా నిలిచాయి. 

 

ఇంకా బ్రూస్ లీ సినిమా ప్లాప్ తర్వాత ధృవతో మంచి హిట్ కొట్టాడు. ధృవ మంచి సినిమా.. 

 

2012 లో ఉపాసన కామినేని ని పెళ్లి చేసుకున్నాడు. 

 

ఈ పదేళ్లలో రామ్ చరణ్ ఎంట్రప్రెన్యూర్ గా కూడా చూసాం. హైదరాబాద్ లో పోలో టీం సొంతంగా ఉంది.. అంతేకాదు.. అప్పట్లో మా టీవీకి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ లో రామ్ చరణ్ ఒకరు.. 2015 లో ట్రూ జెట్ ఎయిర్లైన్స్ లో పార్టనర్ అయ్యారు. 

 

ఇంకా ప్రొడ్యూసర్ గా మారి 2016లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి చిరంజీవి గారి 150థ్ సినిమాకు ప్రొడ్యూసర్ గా మారారు. 

 

2 నంది అవార్డులు, 2 ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు ఇంకా ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నాడు రామ్ చరణ్. 

 

ఇంకా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ సూపర్ హిట్ తర్వాత ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇంకా ఈ సినిమా ఎలాగో ఇండస్ట్రీ హిట్టు.. తెలిసిన విషయమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: