‘బాహుబలి’ తో ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ‘బాహుబలి’ దగ్గర నుండి పలు భాషల ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ సినిమాలలో నటిస్తున్నాడు. దీనితో ప్రభాస్ నుండి సినిమాలు రావడానికి చాల గ్యాప్ ఏర్పడుతోంది. ‘సాహో’ ఘోర పరాజయం తరువాత ప్రభాస్ తన అభిమానులు నిరాశపడకుండా జిల్ రాథాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న మూవీని చాలవేగంగా పూర్తిచేద్దామని ప్రయత్నించినా ప్రభాస్ ప్రయత్నాలకు కరోనా అడ్డు పడింది. 


ఇప్పుడు ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న అశ్వినీ దత్ నాగ్ అశ్విన్మూవీ అక్టోబర్ లో ప్రారంభం అయి ఏప్రిల్ 2022 లో విడుదలచేయాలని భారీ ప్రణాళికలు వేసారు. అయితే కరోనా దెబ్బతో ప్రభాస్ జిల్ రాథాకృష్ణల మూవీ పూర్తి కావడానికి మరింత ఆలస్యం అయి దాని ప్రభావంతో ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించవలసిన లేటెస్ట్ మూవీ ప్రారంభం వచ్చేఏడాదికి వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.  


ఈ వార్తలు ఇలా వైరల్ అవుతున్న నేపధ్యంలో పాన్ ఇండియా ఇమేజ్ ఏమో కానీ వెయిటింగ్ లోనే కాలం గడిచిపోతుంది అంటూ ప్రభాస్ అభిమానుల నిట్టూర్పులు విడుస్తున్నారు. అంతేకాదు అంత వెయిట్ చేసి ‘బాహుబలి’ లా రికార్డులు క్రియేట్ చేస్తే పర్వాలేదు కానీ  ‘సాహో’ లాంటి ప్లాపులు వస్తే పరిస్థితి ఏమిటి అంటూ అభిమానులు మధన పడుతున్నారు. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా కరోనా ప్రభావం వల్ల ప్రభాస్ నాగ్ అశ్విన్మూవీ బడ్జెట్ లో ఎటువంటి కోత ఉండదు అని లీకులు వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు చాల వేగంగా జరుగుతున్నాయి. 


ఈమూవీని 300 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తీసి తీరుతాము అంటూ నిర్మాత అశ్వినీ దత్ చెపుతున్నాడు. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా కరోనా పరిస్థితులు వల్ల ఇండస్ట్రీలో మార్పులు వచ్చినప్పటికీ ప్రభాస్ తో సినిమా అంటే కనీసం 300 కోట్లు పెట్టుబడిగా పెట్టుకోవాలని ప్రభాస్ టీమ్ లీకులు ఇస్తున్నట్లు టాక్. అంతేకాదు ప్రభాస్ ఇక పై లోకల్ రేంజ్ సినిమాలు చెయ్యడం కష్టం అనీ  తక్కువ బడ్జెట్ సినిమాలు చెయ్యడం కూడా సాధ్యపడదని ప్రభాస్ సన్నిహితులు కొందరు ప్రముఖ నిర్మాతల వద్ద కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. దీనితో కరోనా ఎఫెక్ట్ తో టాప్ హీరోల సినిమాలకు సంబంధించి బడ్జెట్ విషయంలో కోతలు ఏర్పడినా ఆకోతలు ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఉండక పోవచ్చు అన్నసంకేతాలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: