టాలీవుడ్ లో కొన్ని బయోపిక్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. వారి జీవితం మీద ఒక్క సినిమా రావాలి అనేది ప్రేక్షకుల కోరిక. ఒక్క ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళినా చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. టాలీవుడ్ లో ప్రేక్షకులు ఎంత ఆశగానో ఎదురు చూసే బయోపిక్... మెగాస్టార్ చిరంజీవి జీవిత కథను తెర మీద చూడాలి అని. చిరంజీవి జీవితాన్ని కింద నాటి నుంచి పై వరకు ఎలా సాగిందో ఈ తరానికి చాలా మందికి తెలియదు. అప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ ను దాటుకుని ఆయన ఎలా హీరోగా ఎదిగారు, 

 

తనకంటూ ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బేస్ ని ఆయన ఏ విధంగా సంపాదించుకున్నారు అనేది చాలా మందికి తెలియదు. అందుకే ఆయన బయోపిక్ వస్తే బాగుంటుంది అనేది మెగా అభిమానుల కోరిక. మరి చిరంజీవి బయోపిక్ ని ఎవరు చేస్తే బాగుంటుంది...? రామ్ చరణ్ సరిపోయే అవకాశం ఉండదు కాబట్టి ఎవరు చేస్తే బాగుంటుంది అంటే శర్వానంద్ గానీ, లేదా నానీ గాని చేస్తే చాలా బాగుంటుంది అనేది మెగా అభిమానుల కోరిక. మెగా అభిమానులు అందరూ కూడా వీరిద్దరిలో ఒకరు అయితే బాగుంటుంది అని.. రామ్ చరణ్ కూడా చేయవచ్చు అంటున్నారు. 

 

ఇప్పుడు టాలీవుడ్ లో పెద్దగా బయోపిక్ ల హడావుడి అనేది లేదు అనే చెప్పాలి. బయోపిక్ లకు మంచి మార్కెట్ ఉన్నా సరే కథ మాత్రం సెట్స్ మీదకు వచ్చే అవకాశాలు ఏ విధంగా కనపడటం లేదు. ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి తెలుగులో. మరి సెట్స్ మీదకు ఏ సినిమా వెళ్తుంది అనేది చూడాలి. టాలీవుడ్ ప్రేక్షకుల మెగా అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: