తెలుగు వెండితెర మీద ఎన్టీఆర్ తరువాత అదే స్థాయి ఇమేజ్ ఉన్న మరో హీరో అక్కినేని నాగేశ్వర రావు. జానపదాలతో కెరీర్ మొదలు పెట్టి తరువాత సాంఘీక చిత్రాలతో ఆకట్టుకున్న అక్కినేని తెలుగు తెర మీద తొలి రొమాంటిక్‌ హీరో అన్న పేరు తెచ్చుకున్నాడు. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన ఏఎన్నార్ బయోపిక్‌ను తెరకెక్కించే ప్రస్తావన కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. అయితే అక్కినేని హీరోలు మాత్రం ఏఎన్నార్ బయోపిక్‌ మీద సీరియస్‌ దృష్టి పెట్టలేదు.

 

కానీ ఇతర హీరోలు హీరోయిన్ల బయోపిక్‌లు రూపొందుతుండటంతో అక్కినేని అభిమానులు ఏఎన్నార్ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఒకవేళ నిజంగానే ఈ లెజెండరీ స్టార్‌ బయోపిక్ తెరకెక్కిస్తే అక్కినేని పాత్రకు ఎవరు సూట్ అవుతారన్న చర్చ కూడా జరుగుతోంది. అక్కినేని ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు. కొడుకు నాగార్జున కమర్షియల్ హీరోగా మంచి ఫాంలో ఉన్నాడు. అయితే అక్కినేని హావ భావాలు పలికించటం మాత్రం కాస్త కష్టమే ఆహార్యంలోనూ తండ్రిని నాగ్‌లో చూడలేం.

 

ఇక నాగచైతన్య.. ఇప్పటికే చైతూ మహానటి సినిమాలో తాత పాత్రలో నటించాడు. అయితే పెద్దగా ఆకట్టుకున్నట్టుగా అయితే అనిపించలేదు. ఏదో ఆ పాత్రకు మనవడు చేశాడన్న పేరు తప్ప అక్కినేని గుర్తు చేసేలా లేదు చైతూ నటన. అఖిల్ విషయానికి వస్తే.. ఇంకా హీరోగానే ప్రూవ్‌ చేసుకోని అఖిల్‌ తాత పాత్రలో నటించటం అంటే రిస్క్ చేయటమే అవుతుంది. ఆ రిస్క్ అఖిల్ చేయకపోవచ్చు. మరో మనవడు సుమంత్‌ ఎన్టీఆర్ బయోపిక్‌లో అక్కినేనిగా నటించాడు. అంతేకాదు తెర మీద తాతను గుర్తు చేశాడు కూడా. కానీ ఆ సినిమా డిజాస్టర్‌ అయ్యింది.  ఆ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి సుమంత్‌ ఫుల్‌ లెంగ్త్‌తో తాత పాత్రలో నటిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: