ఆంధ్రప్రదేశ్ రాజకీయాల లో వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ది ఓ ప్రత్యేకమైన ప్రయాణం. ఎంపీగా పోటి చేసిన గెలిచినా జగన్ తండ్రి ఉన్నంత కాలం ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌ గా లేడు. కానీ వై ఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఆకస్మిక మరణంతో తప్పని పరిస్థితుల్లో జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ లో ఎంపీగా ఉన్న జగన్‌, తరువాత ఓదార్పు యాత్ర  కోసం పార్టీ మీద తిరుగుబాటు చేశాడు. సొంతంగా పార్టీ పెట్టాడు. ఏకంగా 9 సంవత్సరాల పాటు ప్రజల మధ్యే ఉంటూ అధికారాన్ని అందుకున్నాడు.

 

ఈ ప్రయాణంలో ఓ కమర్షియల్ సినిమా కు కావాల్సిన మసాలా అంశాలు ఎన్నో ఉన్నాయి. లగ్జరీ లైఫ్‌ నుంచి ఒక్కసారి గా ప్రజాక్షేత్రంలోకి రావటం , రాజకీయ విమర్శలు, జైలు జీవతం, తిరిగి బయటకు వచ్చి పోరాటం చేయటం ఇలా ఓ మనిషి జీవితం లో ఎవరూ ఊహించని ఎన్నో మలుపులు జగన్ జీవితం  లో ఉన్నాయి. అందుకే ఆయన బయోపిక్ విషయం లో చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికలకు ముందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమా రూపొందింది.

 

మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇటీవల జగన్ బయోపిక్‌ కు కూడా కథ సిద్ధం గా ఉంది అంటూ ప్రకటించాడు మహి. అంతేకాదు జగన్‌ ఓకే అంటే 2022 లో ఆ సినిమాను పట్టాలెక్కిస్తానంటూ ప్రకటించాడు. మరి జగన్‌ బయోపిక్ తెరకెక్కిస్తే హీరో ఎవరు. గతంలో యాత్ర సమయంలో జగన్‌ పాత్ర పెడితే ఆ పాత్రకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ను తీసుకోవాలని భావించాడు మహి. మరి ఇప్పుడు సూర్య తోనే మహి ఈ బయోపిక్‌ను రూపొందిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: