తెలుగు సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మహానటి సావిత్రి బ‌యోపిక్ తర్వాత వరసగా బయోపిక్స్ వస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్, కేసీఆర్, వైఎస్సార్ ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు జయలలిత బయోపిక్ కూడా సెట్స్‌పై ఉంది. ఇక‌ రుద్రమదేవి, సైరా న‌రసింహ‌రెడ్డి లాంటి సినిమాలు కూడా బయోపిక్స్ కిందే వస్తాయి అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు. వీటి సక్సెస్ శాతం కూడా ఎక్కువే ఉంది. దాంతో ఇంకా ఎవరి బయోపిక్ చేస్తే క్రేజ్ ఉంటుందనే విషయమై దర్శక,నిర్మాతలు తెగ ఆలోచనలు చేస్తున్నారు. 

 

ఈ నేపధ్యంలో ల‌వ‌ర్‌బాయ్‌గా అందరి మ‌న‌సులు దోచుకున్న దివంగత  హీరో ఉద‌య్ కిర‌ణ్ బయోపిక్ మూవీగా తీసేందుకు ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ సిద్దమవుతున్నాడనే వార్త మీడియాలో హల్ చల్ చేసింది. మిలీనియం మొదట్లో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో. ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ లవర్ బాయ్..బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో మంచి ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెండితెర ఎంట్రీ ఇచ్చి హీరోగా రాణించిన ఉదయ్ జీవితం ఎంతోమందికి ఆదర్శం. 

 

కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే నంది అవార్డు అందుకున్న నటుడు ఈయన‌. అద్భుతమైన కెరియర్ కళ్ళముందు కనిపిస్తుండగా ఒకే ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది.  సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు అనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధంతరంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే ఈయ‌న ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయాడు..? అన్న ప్ర‌శ్న‌కు ఏళ్లు గ‌డుస్తున్న స‌రైన స‌మాధానాలు లేవు. అయితే ఇలాంటి గొప్ప వ్య‌క్తి గురించి బ‌యోపిక్ వ‌స్తే అది హిట్ అవ్వ‌డం ప‌క్కా అంటున్నారు ప్రేక్ష‌కులు. ఇక ఉద‌య్ కిర‌ణ్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు అన్న‌ది హాట్ టాపిక్ అయింది. 

 

ఈ క్ర‌మంలోనే యంగ్ హీరో సందీప్ కిషన్ ..ఉదయ్ కిరణ్ పాత్రలో నటించబోతున్నాడంటూ ఒక్కసారిగా వార్తలు వ‌చ్చినా.. వాటిలో నిజం లేనట్టు ఇప్ప‌టికే స్ప‌ష్టం అయింది. ఈ క్ర‌మంలోనే న్యాచుర‌ల్ స్టార్ నాని పేరు తెర‌పైకి వ‌చ్చింది. వాస్త‌వానికి  మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి..ఉదయ్ కిర‌ణ్ ‌లాగే హీరోగా ఎదిగిన నాని అయితే ఆ పాత్రకు ఖ‌చ్చితంగా న్యాయం చేయగలడని చెప్పొచ్చు. అంతేకాకుండా, నాని, ఉదయ్ కిరణ్ ఇద్దరిలో కొన్ని సిమిలారిటీస్ కూడా ఉంటాయి. అందుకే ఉద‌య్ కిర‌ణ్ పాత్ర‌లో నాని చేస్తే సూప‌ర్ హిట్ అవుతుంద‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మ‌రి వీరి ఆశ‌లు నెర‌వేర‌తాయా.. లేదా.. అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: