టాలీవుడ్ లో కొందరు నటులు అలా నిలిచిపోయారు. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే నటి సూర్యకాంతం. ఒకప్పుడు ఆమె సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే చాలు ఆమె కోసం ప్రేక్షకులు థియేటర్ కి వెళ్ళే వారు. సినిమాలో ఆమె ఉంది అంటే చాలు లీనమై చూసే పరిస్థితి ఉండేది అప్పట్లో. ఆ విధంగా ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అనేది వాస్తవం. అగ్ర హీరోల అందరికి ఆమె అత్తగా నటించారు. చిన్న హీరోల సినిమాల్లో కూడా ఆమె చాలా మంచి పాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

 

ఇక ఆమె కెరీర్ లో అక్కినేని, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు సినిమాల్లో చేసిన పాత్రల గురించి యంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె నటించిన పాత్రలు ఏ ఒక్క నటి కూడా చేయలేదు అనేది వాస్తవం. ఆ విధంగా సూర్యకాంతం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మరి ఆమె బయోపిక్ చేస్తే ఎవరు అయితే బాగుంటుంది అని చాలా మందికి సందేహం ఉంది. ఆమె బయోపిక్ అంటే సాధారణ విషయం కాదు అనేది వాస్తవం. చిన్న చిన్న నటులు ఆమె పాత్రను అంత పక్కాగా పోషించే అవకాశం ఉండదు. 

 

ఆమె బయోపిక్ కి రమ్యకృష్ణ అయితే బాగుంటుంది అని కొందరు అంటే రోజా అయితే బాగుంటుంది అని మరికొందరు అంటున్నారు. వీళ్ళు ఇద్దరు అయితేనే కథకు పూర్తిగా న్యాయం చేస్తారని చెప్తున్నారు. వీళ్ళు మినహా ఎవరు చేసినా సరే ఆ స్థాయిలో సినిమా ఉండదు అని వ్యాఖ్యానిస్తున్నారు. బాలీవుడ్ లో విద్యా బాలన్ కూడా చేసినా బాగానే ఉంటుంది అని అంటున్నారు. ఆమె బయోపిక్ తీయాలి అంటే ఇప్పటి దర్శకులకు ఎవరికి సాధ్యం కాదు అనేది కొందరి మాట. మరి ఎవరు అయితే బాగుంటుందో మీరే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: