లాక్డౌన్ కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో జనాలు వినోదం కోసం ఓటీటీలని ఆశ్రయిస్తున్నారు. తెలుగు, తమిళం అని కాకుండా ప్రపంచ భాషల్లోని తమకి నచ్చిన వెబ్ సిరీస్ లని చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కి గిరాకీ బాగా పెరిగింది. లాక్డౌన్ పుణ్యమా అని జనాలు కూడా వెబ్ సిరీస్ లకి బాగా అలవాటు పడ్డారు. దాంతో సినిమా హీరోల దృష్టి వీటి మీద పడింది.

 

ఇప్పటికే తెలుగులోనూ చాలా వెబ్ సిరీస్ లు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఆవెబ్ సిరీస్ లలో పేరున్న హీరోలెవరూ కనిపించడం లేదు. స్టార్ హీరోలు వెబ్ సిరీస్ లకి చాలా దూరంగానే ఉంటున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా మారాయి. డిజిటల్ స్ట్రీమింగ్ కి డిమాండ్ పెరగడంతో అక్కడ కూడా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఎఫ్ ౨ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన వెంకటేష్, వెంకీ మామాతో మంచి హిట్ అందుకున్నాడు.

 

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ చిత్రమైన అసురన్ తెలుగు రీమేక్ నారప్పలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చిందని అంటున్నారు. లాక్డౌన్ పూర్తికాగానే షెడ్యూల్ స్టార్ట్ అవనుంది. అయితే అదలా ఉంటే, ఆ సినిమా అయిపోయిన తర్వత వెంకీ ఓ వెబ్ సిరీస్ నటించనున్నాడని సమాచారం. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఈ విషయమై సంప్రదింపులు జరుగుతున్నాయట.

 

మరి ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చి వెంకీ హీరోగా తేజ దర్శకత్వంలో వెబ్ సిరీస్ స్టార్ట్ అయితే గనక తెలుగు హీరోలందరూ వెబ్ సిరీస్ ల వంక చూడడం ఖాయం. అయితే ఎన్ని వెబ్ సిరీస్ లు చేసినా సినిమాకి ఉన్న ప్రాముఖ్యం వేరే ఉంటుందన్న కారణంగా మన వాళ్లు ఇటువైపు రావడానికి ఆలోచిస్తుంటారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏమి జరగనుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: