టాలీవుడ్ లో శోభన్ బాబు అనగానే మహిళా ప్రేక్షకులకు కళల రాకుమారుడు అనే మాట వినపడుతుంది. ఎంత మంది హీరోలు వచ్చినా సరే తన అందంతో ఆయన అలా నిలిచిపోయారు. తెలుగు సినిమాలో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. చిన్న నటుడిగా ప్రారంభమై అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగారు.  ఎందరో స్టార్ హీరోలు ఉన్నా సరే ఆయన మాత్రం టాలీవుడ్ లో నిలబడ్డారు. శోభన్ బాబు అనగానే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది అప్పట్లో. ఆయన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. 

 

ఒక సామాన్యుడుగా సినిమాలను మొదలుపెట్టారు. మరి ఆయన బయోపిక్ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే... ఏ హీరో అయితే బాగుంటుంది.  వరుణ్ తేజ్ అయితే బాగుంటుంది అని కొందరు అంటే కాదు అని మరి కొందరు అంటున్నారు. ఆయన బయోపిక్ కి తెలుగు హీరోలు ఎవరూ మ్యాచ్ అవ్వరు అని మరో హీరోని ఎవరిని అయినా చూస్తే... తమిళ హీరోలను చూడాలని శివ కార్తికేయన్ అయితే బాగుంటుంది అనేది కొందరు అంటున్నారు. మన తెలుగులో సుమంత్ అయినా బాగానే ఉంటుంది అనేది కొందరి మాట. 

 

అయితే ఆయన జీవితంలో చాలా కోణాలు ఉంటాయి. ప్రధానంగా జయలలిత జీవితాన్ని కూడా ఆయన సినిమాలో చూపించాల్సి ఉంటుంది. ఆమె జీవితాన్ని ఏ దర్శకుడు తీసుకొస్తారు అనేది చూడాలి ఆయన జీవితంలో సినిమాతో పాటుగా వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆ వివాదాలను కూడా సినిమాలో చూపించాలి. మరి  అంత సమర్ధవంతం గా ఎవరు చూపిస్తారు అనేది చూడాలి. సుమంత్ ఆయన సినిమాను చేసే అవకాశం వస్తే చేస్తారా లేదా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం సుమంత్ సినిమాలకు దూరంగానే ఉన్నారు. వరుణ్ తేజ్ ఈ ఆఫర్ వస్తే చేస్తాడా లేదా అనేది కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: